గుంజన ఏరును పరిశీలించిన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు
రైల్వే కోడూర్ జులై 27 ( పున్నమి న్యూస్ )
*గుంజన ఏరుకు ప్రొటెక్షన్ వాల్ లేకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని వివరిస్తున్న స్థానిక ప్రజలు*
*రైల్వేకోడూరులో శాంతినగర్ నరసరాంపేట కు మధ్యలో ఉన్న గుంజన ఏరును 27-07-2025వ తేదీ ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు విచ్చేసి గుంజన ఏరుకు ప్రొటెక్షన్ వాల్ లేకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అక్కడకి విచ్చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు తో ప్రతి సంవత్సరం వచ్చే వరదల కారణంగా ఏటిలో వరద ఉధృతి పెరిగి భూమి కోతకు గురై ఏటిని ఆనుకొని ఉన్న భవనాలు కూలిపోవడం జరుగుతుందని. వర్షాకాలంలో ఏరు వచ్చిన ప్రతిసారి రాత్రి సమయాల్లో నిద్ర కూడా పట్టడం లేదని భయాందోళకంగా ఉంటుందని ప్రతి సంవత్సరం వర్షాలకి ఎంతో కొంత ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతూ ఉందని గతంలో ఇల్లు దెబ్బతిన్న వారికి కొంతమేర ఆర్థిక సహాయం మరియు విత్యావసర వస్తువులను, కట్టుకోవడానికి బట్టలు అందజేసి మాకు అండగా నిలబడ్డారని తెలిపారు. అలాగే పలుమార్లు మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం ద్వారా ప్రొటెక్షన్ వాల్ నిర్మించి మమ్మల్ని ఆదుకోవాలని చాలా సంవత్సరాల నుండి బత్యాల చంగల్ రాయుడు ప్రయత్నిస్తున్నారని. కనీసం ఇప్పటికైనా ప్రొటెక్షన్ వాల్ కట్టించి మమ్మల్ని ఆదుకోవాలని నిమ్మల రామానాయుడు ని కోరారు. అనంతరం టిడిపి మాజీ ఇంచార్జ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కస్తూరి విశ్వనాథ నాయుడు టిడిపి కార్యాలయానికి విచ్చేయగా అక్కడ రైల్వేకోడూరు ప్రస్తుత రాజకీయ పరిణామాలు పై ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ ఇంకా పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


