పలమనేరు, జూలై27,2020(పున్నమి విలేకరి): కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులను,కళాశాలల లెక్చరర్లు ను ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలని ప్రైవేటు ఉపాధ్యాయులు,లెక్చరర్లు సంఘం డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీచర్లు సంఘం అధ్యక్షుడు దేవేంద్ర, మాట్లాడుతూ… మార్చి నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.జీతాలు లేక కొందరు ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు పూట గడవక వీధుల్లో పండ్లు, కూరగాయలు అమ్మ్ముకుంటూ జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందిని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులు,లెక్చరర్లు జీతాలు లేక అప్పులుపాలై ఆతహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడు ఆ ఘనత మా ఉపాధ్యాయులదేనని సన్మానించి ప్రచారం చేసుకున్న ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రస్తుతం స్పందించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రేమకుమార్,రెడ్డి శేఖర్, రాజేశ్వరరావు, భరత్ తదితరులు పాల్గొన్నారు.