ప్రైవేటీకరణకు…. పీపీపీకి మధ్య తేడా తెలియని స్థితిలో వైకాపా వారు ఉన్నారు
– ఈ పీపీపీ పద్దతి అనేది కొత్తగా మన రాష్ట్రంలోనే లేదు
– రాజమండ్రి మెడికల్ కళాశాలకు వారు ఖర్చు చేసింది రూ. 10 కోట్లు మాత్రమే
– మనం ఈ 15 నెలల్లో రూ. 32 కోట్లు ఖర్చు చేశాం
– ప్రభుత్వాసుపత్రికి సూపర్ స్పెషాలిటీ సర్వీసులు కావాలి
– మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయోద్దు
– వైకాపా వారికి సూచన
– అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం :
గత కొన్ని రోజులుగా వైఎస్సార్‌సీపీ నాయకులు మెడికల్ కళాశాలల ప్రస్తావన తీసుకువచ్చి ప్రైవేటీకరణ అంటూ రాద్దాంతం చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రైవేటీకరణకు… పీపీపీకి మధ్య తేడా తెలియని స్థితిలో వైకాపా వారు ఉన్నారని, అటువంటి వ్యక్తులు ప్రతిపక్ష హోదా అడగడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ఈ పీపీపీ విధానం ఏదో మన ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రయోగాత్మకంగా చేస్తున్నట్లు వారు మాట్లాడుతున్నారు కానీ… ఇప్పటికే కస్తూరిభా మెడికల్ కళాశాల (బెంగుళూర్) ఇది పీపీపీ మోడ్‌లో నడుస్తోందన్నారు. దానితో పాటు శాంతి నికేతన్ మెడికల్ కళాశాల (పశ్చిమ బెంగాల్) పీపీపీ మోడ్‌లో నడుస్తోందని, త్రిపుర మెడికల్ కళాశాల త్రిపుర, అలాగే కర్ణాటకలో 11 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించి అతి త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. గతంలో వైకాపా వారు చేసిన తప్పులు… తీసుకున్న అప్పులు తీసుకువచ్చి తిరిగి చెల్లించకపోవడం వల్ల మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకురావాల్సి వచ్చిందన్నారు. రాజమహేంద్రవరంలోని మెడికల్ కళాశాల విషయానికి వస్తే వైకాపా అధికారంలో ఉన్న సమయంలో దాని కోసం వారు రెండేళ్లల్లో ఖర్చు చేసింది కేవలం రూ. 10 కోట్లు అయితే కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లోనే ఖర్చు చేసింది రూ. 32 కోట్లని వివరించారు. ప్రస్తుతం 3వ ఏడాది విద్యార్ధులు వచ్చారని… వారు వచ్చే సమయానికి అక్కడ జి ప్లస్ 5 కింద బాయ్స్ అండ్ గాల్స్ ఏదైతే వసతి గృహాలు ఉన్నాయో బ్లాక్స్ నిర్మాణం చేయని స్థితిలో ఉన్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు రూ. 20 కోట్లతో నిర్మాణాలు చేసుకుని విద్యార్ధులకు వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. వైకాపా వారు కళాశాలకు శాశ్వత నిర్మాణాలు చేపట్టలేకపోయారు కానీ…. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాలకు, తాత్కాళిక మెడికల్ కళాశాలకు కూత వేటు దూరంలో ఉన్న ఆర్ అండ్ బి అతిధి గృహం వద్ద ఆర్ అండ్ బి స్థలంలో వైకాపా వారు రాజ్ మహాల్‌ను తలపించేలా పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం, దాని వెనుక నుంచి హెలీప్యాడ్‌కు దారి నిర్మించుకోవడం కూడా జరిగిందని ఎద్దేవా చేశారు. అలాగే వైకాపా వారి నిర్లక్ష్యం కారణంగా మరుగునపడిపోయిన అల్లు రామలింగయ్య హోమియో కళాశాలకు చెందిన 23 పీజి సీట్లను మంత్రి సత్య యాదవ్‌తో మాట్లాడి కళాశాల యాజమన్యంతో ఢల్లీిలోని సంబంధిత శాఖామాత్యుల వారికి ఎంపి దగ్గుబాటి పురంధేశ్వరి వారి సహకారంతో వినతి పత్రం ద్వారా తెలియచేసి ఆ సీట్లను సాధించుకోగలిగామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము ఇలా చేయడం వల్ల గుడివాడ, కడప హోమియో కళాశాలల్లో కూడా పీజీ సీట్ల పునరుద్ధరణ జరిగింద్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి రోజుకు 500 నుంచి 600 ఓపీ ఉండగా మనం అధికారంలోకి వచ్చిన తరువాత రోజుకు సుమారు 1800లకు పెరిగిందన్నారు. అయితే ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ సర్వీసులు అవసరం ఉన్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఐఎంఎ వారి సహకారంతో ప్రస్తుతం ఆ సర్వీసులు అందిస్తున్నామని, అయితే సంబంధిత శాఖామాత్యులు ఈ విషయంపై దృష్టి పెట్టి సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని కోరారు. కాగా ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి వైకాపా వారు ఓర్వలేరు… జీర్ణించుకోలేరు… అభినందించలేరని, అయితే రాష్ట్రానికి నష్టం కలిగించే పనులు మాత్రం చేయోద్దని సూచించారు.

ప్రైవేటీకరణకు పిపిపికి మధ్య తేడా తెలియని స్థితిలో వైకాపా వారు ఉన్నారు
ప్రైవేటీకరణకు…. పీపీపీకి మధ్య తేడా తెలియని స్థితిలో వైకాపా వారు ఉన్నారు – ఈ పీపీపీ పద్దతి అనేది కొత్తగా మన రాష్ట్రంలోనే లేదు – రాజమండ్రి మెడికల్ కళాశాలకు వారు ఖర్చు చేసింది రూ. 10 కోట్లు మాత్రమే – మనం ఈ 15 నెలల్లో రూ. 32 కోట్లు ఖర్చు చేశాం – ప్రభుత్వాసుపత్రికి సూపర్ స్పెషాలిటీ సర్వీసులు కావాలి – మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయోద్దు – వైకాపా వారికి సూచన – అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం : గత కొన్ని రోజులుగా వైఎస్సార్‌సీపీ నాయకులు మెడికల్ కళాశాలల ప్రస్తావన తీసుకువచ్చి ప్రైవేటీకరణ అంటూ రాద్దాంతం చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రైవేటీకరణకు… పీపీపీకి మధ్య తేడా తెలియని స్థితిలో వైకాపా వారు ఉన్నారని, అటువంటి వ్యక్తులు ప్రతిపక్ష హోదా అడగడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ఈ పీపీపీ విధానం ఏదో మన ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రయోగాత్మకంగా చేస్తున్నట్లు వారు మాట్లాడుతున్నారు కానీ… ఇప్పటికే కస్తూరిభా మెడికల్ కళాశాల (బెంగుళూర్) ఇది పీపీపీ మోడ్‌లో నడుస్తోందన్నారు. దానితో పాటు శాంతి నికేతన్ మెడికల్ కళాశాల (పశ్చిమ బెంగాల్) పీపీపీ మోడ్‌లో నడుస్తోందని, త్రిపుర మెడికల్ కళాశాల త్రిపుర, అలాగే కర్ణాటకలో 11 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించి అతి త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. గతంలో వైకాపా వారు చేసిన తప్పులు… తీసుకున్న అప్పులు తీసుకువచ్చి తిరిగి చెల్లించకపోవడం వల్ల మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకురావాల్సి వచ్చిందన్నారు. రాజమహేంద్రవరంలోని మెడికల్ కళాశాల విషయానికి వస్తే వైకాపా అధికారంలో ఉన్న సమయంలో దాని కోసం వారు రెండేళ్లల్లో ఖర్చు చేసింది కేవలం రూ. 10 కోట్లు అయితే కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లోనే ఖర్చు చేసింది రూ. 32 కోట్లని వివరించారు. ప్రస్తుతం 3వ ఏడాది విద్యార్ధులు వచ్చారని… వారు వచ్చే సమయానికి అక్కడ జి ప్లస్ 5 కింద బాయ్స్ అండ్ గాల్స్ ఏదైతే వసతి గృహాలు ఉన్నాయో బ్లాక్స్ నిర్మాణం చేయని స్థితిలో ఉన్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు రూ. 20 కోట్లతో నిర్మాణాలు చేసుకుని విద్యార్ధులకు వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. వైకాపా వారు కళాశాలకు శాశ్వత నిర్మాణాలు చేపట్టలేకపోయారు కానీ…. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాలకు, తాత్కాళిక మెడికల్ కళాశాలకు కూత వేటు దూరంలో ఉన్న ఆర్ అండ్ బి అతిధి గృహం వద్ద ఆర్ అండ్ బి స్థలంలో వైకాపా వారు రాజ్ మహాల్‌ను తలపించేలా పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం, దాని వెనుక నుంచి హెలీప్యాడ్‌కు దారి నిర్మించుకోవడం కూడా జరిగిందని ఎద్దేవా చేశారు. అలాగే వైకాపా వారి నిర్లక్ష్యం కారణంగా మరుగునపడిపోయిన అల్లు రామలింగయ్య హోమియో కళాశాలకు చెందిన 23 పీజి సీట్లను మంత్రి సత్య యాదవ్‌తో మాట్లాడి కళాశాల యాజమన్యంతో ఢల్లీిలోని సంబంధిత శాఖామాత్యుల వారికి ఎంపి దగ్గుబాటి పురంధేశ్వరి వారి సహకారంతో వినతి పత్రం ద్వారా తెలియచేసి ఆ సీట్లను సాధించుకోగలిగామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము ఇలా చేయడం వల్ల గుడివాడ, కడప హోమియో కళాశాలల్లో కూడా పీజీ సీట్ల పునరుద్ధరణ జరిగింద్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి రోజుకు 500 నుంచి 600 ఓపీ ఉండగా మనం అధికారంలోకి వచ్చిన తరువాత రోజుకు సుమారు 1800లకు పెరిగిందన్నారు. అయితే ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ సర్వీసులు అవసరం ఉన్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఐఎంఎ వారి సహకారంతో ప్రస్తుతం ఆ సర్వీసులు అందిస్తున్నామని, అయితే సంబంధిత శాఖామాత్యులు ఈ విషయంపై దృష్టి పెట్టి సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని కోరారు. కాగా ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి వైకాపా వారు ఓర్వలేరు… జీర్ణించుకోలేరు… అభినందించలేరని, అయితే రాష్ట్రానికి నష్టం కలిగించే పనులు మాత్రం చేయోద్దని సూచించారు.

