Thursday, 5 February 2026
  • Home  
  • ప్రేమ తపస్సు (1974 కథ) – డాక్టర్ బద్రి పీర్ కుమార్
- సాహితీ

ప్రేమ తపస్సు (1974 కథ) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

విధ్యేంది అనే ఒక మారుమూల గ్రామంలో మారయ్య, శాంతి అనే ఇద్దరు దంపతులుండేవారు. శాంతి వందెకరాల భూమిగల ధనికురాలు. వీరిది ప్రేమ వివాహం, చాలా అన్యోన్య దాంపత్యం గడిపేవారు. వీరికి ఒక అమ్మాయి. పేరు ప్రేమ. వయసు 6 సంవత్సరాలు. శాంతికి తన కుమార్తెను చదివించాలని ఆకాంక్ష కాని తగిన వసతులు ఆ ఊళ్ళోలేవు. ఆ సమీపంలో ఉన్న పట్టణంలో చదివించాలంటే శాంతికి ఇష్టం లేదు. కొన్ని రోజుల తర్వాత అనారోగ్య కారణాల వలన శాంతి తన ఆస్తి మొత్తాన్ని ప్రేమ పేరున వ్రాసి మరణించింది. ప్రేమకు తల్లిలేని లోటును భర్తీచేయాలనే సదుద్దేశంతో మారయ్య చింతాంగి అనే తన అత్త కూతుర్ని మరలా వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె మారయ్య జీవిత భాగస్వామిగా ప్రేమను తెలివి లేని మూర్ఖురాలిగా చేసి ఆస్తినంతటిని తాను అనుభవించాలన్న దురభిప్రాయం కల్గి ప్రేమ పట్ల అనుచితంగా ప్రవర్తించేది. మారయ్య బయటి పనులతో ఇంటి వద్ద ఉండేవాడు కాదు. 11 సంవత్సరాల తర్వాత ఊళ్ళో స్కూళ్ళు ప్రారంభించారు. ఆంధ్ర దేశంలో అక్షరాస్యత ఉద్యమం జోరుగా సాగుతోంది. “ప్రతి ఒక్కరు చదువు కోవాలి”, “ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు”, “విద్యా దానం మహాదానం”, “విద్య లేని వాడు వింత పశువు”, “ఇంటింటా చదువు దేశానికి వెలుగు”. ”అందరూ చదవాలి, అన్యాయాలను ఎదిరించాలి”. అను నినాదాలు ప్రతిఒక్కరి చెవులలో మారు మ్రోగుతున్నాయి. “విధ్యేంది” గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ చిన్నా, పెద్దా తేడా లేకుండా, అక్షరాస్యతా ఉద్యమంలో పాల్గొని చదువు నేర్చుకుంటున్నారు. కాని ఆ ఊరి పెద్ద మనిషి అయిన మారయ్య తన పెద్ద భార్య కుమార్తె ప్రేమను పాఠశాలకు పంపడం లేదు. కారణం అతని రెండవ భార్య చింతాంగి. ఈమె కసాయి హృదయురాలు. ప్రేమను ఏనాడు రెండుకళ్ళతో చూడలేదు. ప్రేమ వయస్సు ఇప్పుడు 17 సం॥లు. చిన్నప్పటి నుంచి చదువు పట్ల ఆసక్తి ఉన్నా అమాయకంగా కనపడేది. బడికెళుతున్న వారిని చూసి “నాకు ఆ అదృష్టం లేదని” తనలో తాను మదనపడుతూ ఉండేది. మారయ్య చాలా సహృదయుడు మరియు పిరికి వాడు. గ్రామంలో ఇతరులకు చాలా గంభీరంగా కనబడతాడు. తన రెండవ భార్య దగ్గర మాత్రం పిల్లిలా ప్రవర్తించేవాడు. ఓ రోజు ప్రేమ మనోవేదనను గ్రహించి, “చూడమ్మా .. ప్రేమ.. మీ పిన్నమ్మ నీకు ఈ ఊరిలో చదువు రానివ్వదు.. నీవు చదివితే ఏదో ప్రయోజకురాలు అవుతావనీ.. తనకు చదువు లేదని.. నీవు గొప్ప విద్యావంతురాలు అయితే.. తనను లెక్క చేయవని మూర్ఖత్వంతో నిన్ను ఇలా కష్టబెడుతుంది.. మీ అమ్మే బ్రతికి ఉంటే ఈ చింతాంగి నా భార్య అయ్యేదా..? నీకు ఈ గతి పట్టేదా..? పట్టేది కాదు… ఈ వేళకు ఇంటర్ చదువుతూ ఉండే దానివి..” అని చింతించిగ మనసులో ఒక మెరుపులాంటి ఆలోచన కలిగింది. “మీ పిన్ని వాళ్ల పుట్టింటికి పనిమీద వెళ్ళింది. రేపు ఉదయాన్నే .. నాతో బయలు దేరు. ఇదే సరైన సమయం తను చూసిందంటే నిన్ను నాతో ఎప్పటికీ పంపదు. హైదరాబాద్లో నా స్నేహితుడు హైస్కూలు హెడ్మాస్టర్ చాలా మంచి వాడు. నిన్ను అతని దగ్గర వుంచితే… నీ పట్టుదలకు.. ఆసక్తికి.. గొప్ప విద్యావంతురాలు అవుతావు. ఏకువ జామునే తయారవ్వు..” అని మారయ్య అనగానే ప్రేమకు గొప్ప ఉపశమనం కలిగి ‘అలాగే’ అని తలూపింది. ఉదయం ఆ ఊరి మొదటి బస్సు హైదరబాద్ బస్సు వచ్చేవేళకు బయలుదేరుతారు. బస్సు స్టేజి దగ్గర ఆగింది. మారయ్య, ప్రేమ బస్సెక్కారు. ఈ విషయం తెలుసుకున్న చింతాంగి అదే సమయానికి వచ్చి బయలు దేరుతున్న బస్సును, తన అనుచరుల చేత ఆపించింది. మారయ్య డ్రైవర్ను గదమాయించి “నీవు పోనివ్వు బస్సును” అన్నాడు. చింతాంగి మారయ్యతో “దీన్ని పట్టణానికి పంపి చదివించావంటే.. నీ పెద్ద భార్య ఆస్తి నాకు చిల్లిగవ్వంత కూడా రాదు.. అప్పుడు నీవు.. నేను.. నెత్తిన గుడ్డేసుకొని ఏడ్వాలి.. ముందు దిగు” అని కరిచినట్లుగా అరుస్తుంది. “ఛీ.. నీచురాలా.. నీవు కసాయిదానివే అనుకున్నాను.. కానీ ఇప్పుడు మెదడు లేని గ్రుడ్డిదానివని భావిస్తున్నాను” అన్నాడు మారయ్య అసహనంగా. విషయం గ్రహించిన బస్సు డ్రైవర్ చింతాంగి మాటలు లెక్కచేయక ఆమెను క్రిందకు దించి బస్ స్టార్ట్ చేశాడు. *** హెడ్ మాస్టర్ శాంతి స్వరూప్ చమత్కారి వినయశీలుడు మరియు ధర్మాత్ముడు. తన భార్యతో “ఏమే.. కాంతం.. ఎవరొచ్చారో చూడు.. మారయ్యను చూసి చాలా కాలం అయింది..” “అరే ప్రేమ ఎంత ఎదిగిపోయింది.. చూసి పదేండ్లయింది” అంటూ కాంతం వంటగదిలో నుంచి వచ్చి స్వాగతం పలికింది. మారయ్య వారి ఆప్యాయతకు కృతజ్ఞుడై ఆనంద భాష్పాలు రాల్చాడు. “రేయ్ ఏరా.. చిన్న పిల్లవాడిలా ఏడుస్తున్నావ్.. ఊరుకో.. పరిస్థితి నాకు అంతా తెలుసు.. నీకు నేను దూరంగా ఉన్నా పుట్టిన ఊరు విషయాలు.. అందులో నా ఆప్తుల సంగతులు తెలుసుకుంటూ ఉంటాను.. ప్రేమను బాగా చదివించి.. నా కోడల్ని చేసుకుంటాను” అని శాంతి స్వరూప్ అంటుండగా కాస్త స్థిమిత పడి “విజయ్ ఇప్పుడు ఏంచేస్తున్నాడు” అన్నాడు మారయ్య. ”వాడు పూణేలో ఆర్మీ కాలేజీలో డిగ్రీ జాయిన్ అయ్యాడు.. ఆర్మీలో చేరి దేశ రక్షణలో తన వంతు సేవ చేయాలని వాడి కోరిక.. నేను చేయలేని పని నా కుమారుడు చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది..” అంటూ భావోద్వేగం నుండి తేరుకుని “నీవు నిశ్చింతగా ఉండు” అన్నాడు స్వరూప్ ఓదార్పుగా. “ఏంటన్నయ్యా.. ప్రేమ నా కూతురు లాంటిది.. చింతాంగి చేతులో ఎంత నలిగిందో నాకు తెలుసు.. బాగా చదివించి, ఆ చింతాంగి కళ్ళు తెరిపిస్తాము.. పుట్టుగొడ్రాలు.. నీ కర్మ పట్టి ఆమెను పెళ్ళి చేసుకున్నావు” అంది కాంతం చింతాంగిపై అసహనంతో. “అవన్ని ఎందుకులే కాంతం.. ముందు మీ అన్నయ్యను ప్రేమను విశ్రాంతి తీసుకోనివ్వు.. అంత దూరం ప్రయాణం చేసి వచ్చారుగా.. ప్రేమ.. నీవు పైనున్న గది లో ఫ్రెష్అప్ అయ్యిరా” అంటూ శాంతి స్వరూప్ తన బుక్ స్టాండ్లో పెద్ద బాలశిక్ష తీసుకొని చదువుతున్నాడు. “ఏరా స్వరూప్.. ఈ వయస్సులో నీకు పెద్ద బాలశిక్ష అవసరం ఏంటిరా” అన్నాడు మారయ్య. ”అదే నీకు.. నాకు.. తేడా.. దీనిలోని సారాంశాన్ని ప్రేమకు తెలియజెప్పాలి”.. కాంతం ప్రేమ ఫ్రెష్ అయి రాగానే అందరికీ వడ్డించు చాలా పని ఉంది. నేను అనుకున్నది నెరవేర్చాలి.. ప్రేమను ప్రయోజకరాలిని చేయాలి” అన్నాడు శాంతి స్వరూప్. ”అబ్బబ్బ అన్నయ్య.. ఇక ఈయన.. ప్రేమను డిగ్రీ చదివించినంత వరకు నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు”. నవ్వుతూ వినయంగా అంది కాంతం మారయ్యతో. “అమ్మా .. ప్రేమ భోంచేసిన తర్వాత ఈ రోజు బాగా విశ్రాంతి తీసుకో.. నీ విద్యాభ్యాసం రేపటి నుంచే మొదలెడతా” అన్నాడు శాంతి స్వరూప్ ప్రేమ ఫ్రెష్అయి రాగానే. “అలాగేనండి” అంది ప్రేమ వినయంగా అమాయకత్వపు చూపుతో. మధ్యాహ్నం భోజనం చేసి “అమ్మా ప్రేమ.. మాస్టర్ చెప్పినట్లు నడుచుకో” అని ప్రేమకు చెప్పి “మరి నేను వెళ్ళాస్తా స్వరూప్.. వెళ్ళొస్తాను కాంతమ్మా..” అని విద్యేందికి బయలు దేరాడు మారయ్య. అతని పరిస్థితి తెలిసిన కాంతం, స్వరూప్ కనీసం ఆ రోజంతా కూడా ఉండమని చెప్పనందుకు చింతించి ప్రేమ భవిష్యత్తుకై తమ దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. *** ఆరోజు రాత్రికి తన ఇంటికొచ్చిన మారయ్య పామువలె బుసలు కొడుతున్న చింతాంగిని ఏ మాత్రం పలకరించకుండా తన పనులు తానే చేసుకుంటూ జీవితం కొనసాగించాలని అనుకున్నాడు. మరునాడు ఉదయం 5 గం॥లకు అలార్మ్ మ్రోగింది వెంటనే శాంతి స్వరూప్ నిద్రలేచి ప్రేమకు సంబంధించిన విద్యాభ్యాస ప్రణాళికను తయారు చేశాడు. 6 గంటలకు ప్రేమను నిద్రలేపాడు. ఆ రోజు అక్షరమాలను పెద్ద బాలశిక్ష సారాంశాన్ని నేర్పించాడు. దీనికి ప్రేమ యొక్క ఆసక్తి, ఏకాగ్రత, పట్టుదల మరియు స్వరూప్ యొక్క సులభ బోధనాశైలి దోహదపడ్డాయి. 10వ తరగతిలోపు విద్యాంశాలను 10 రోజులలో ప్రేమ నేర్చుకున్నది. శాంతి స్వరూప్ అతని స్నేహితులయిన ఇతర ఉద్యోగస్తులు కూడా, ప్రేమ తెలివి తేటలకు ఆశ్చర్య పోయారు. తెలిసిన ప్రతివారి నుంచి ప్రశంసలు వచ్చాయి. శాంతి స్వరూప్ హృదయం ఆనందంతో ఉప్పొంగి పోయింది. అందరి అభినందనలతో ప్రేమను తను పనిచేస్తున్న స్కూల్లో 10వ తరగతిలో చేర్చాడు. కాంతం ప్రేమను తన కుమార్తెలా చూసుకొంటోంది. ప్రేమ పదవ తరగతి సంవత్సర పరీక్షలు వ్రాసి 90 శాతం మార్కులు సంపాదించింది. ఈ విషయం తెలిసిన తండ్రి మారయ్య సంతోషించాడు. “ఆc.. ఆ.. చదివింది చాలు ఇకనయినా ఇంటికి తీసుకురండి” అంది పైకి ప్రేమున్నట్లుగ చింతాంగి. ఈమె అంతర్గత భావన తెలిసిన మారయ్య వినిపించకోక తన కుమార్తె గొప్ప పండితురాలవుతుందని భావించి మనసున కొండనెత్తినంతగ ఆనందించాడు. *** శాంతి స్వరూప్ సహకారంతో మారయ్య ప్రోత్సాహంతో ప్రేమ B.A. డిగ్రీ పుచ్చుకొని సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు వ్రాసి 3వ ర్యాంక్ సాధించింది. సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ I.A.S. ఇంటర్వూకు కాల్ లెటర్ వచ్చింది. శాంతి స్వరూప్ ఎంతో ఆనందించాడు. “అమ్మా ప్రేమ నీకు ఇంటర్యూ వచ్చింది. నీవు తప్పకుండా కలెక్టరు అవుతావు” అన్నాడు. ప్రేమ ఆనందానికి హద్దులు లేవు. తన చనిపోయిన అమ్మను గుర్తుకు తెచ్చుకొని మౌనముగా ఉండిపోయింది … మరుసటి రోజు ఉదయం 10 గం॥లకు ఇంటర్వూ. ఇంటర్వ్యూ హాల్ లో, బెల్ మ్రోగింది ప్రేమకు ఎంత ప్రతిభ ఉన్నా బోర్డు సభ్యులను చూసి కొద్దిగ జంకింది. ఇంటర్వూ బోర్డ్ సభ్యులు ప్రేమను చూసి ఆమె బాహ్య రూపం అమాయకంగా కన్పించుట వలన తక్కువగా అంచనా వేసి, మొదట చిన్న ప్రశ్నలు అడిగారు. ” నీవు వ్రాసిన ప్రవేశ పరీక్షలో మొదటి ప్రశ్న ఏదీ?, “జర్మనీలో నాజీజమ్ స్థాపకుడు ఎవరు?” “హిట్లర్” అంది ప్రేమ. “వెరీగుడ్” అన్నాడు ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడు ఒకరు. ఈమె చురుకైన జవాబులు విన్న బోర్డు సభ్యులు పెద్ద ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు. “ప్రతి మనిషికి ఉండాల్సిన ధ్యేయం ఏమిటి?”

విధ్యేంది అనే ఒక మారుమూల గ్రామంలో మారయ్య, శాంతి అనే ఇద్దరు దంపతులుండేవారు. శాంతి వందెకరాల భూమిగల ధనికురాలు. వీరిది ప్రేమ వివాహం, చాలా అన్యోన్య దాంపత్యం గడిపేవారు. వీరికి ఒక అమ్మాయి. పేరు ప్రేమ. వయసు 6 సంవత్సరాలు. శాంతికి తన కుమార్తెను చదివించాలని ఆకాంక్ష కాని తగిన వసతులు ఆ ఊళ్ళోలేవు. ఆ సమీపంలో ఉన్న పట్టణంలో చదివించాలంటే శాంతికి ఇష్టం లేదు. కొన్ని రోజుల తర్వాత అనారోగ్య కారణాల వలన శాంతి తన ఆస్తి మొత్తాన్ని ప్రేమ పేరున వ్రాసి మరణించింది.
ప్రేమకు తల్లిలేని లోటును భర్తీచేయాలనే సదుద్దేశంతో మారయ్య చింతాంగి అనే తన అత్త కూతుర్ని మరలా వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె మారయ్య జీవిత భాగస్వామిగా ప్రేమను తెలివి లేని మూర్ఖురాలిగా చేసి ఆస్తినంతటిని తాను అనుభవించాలన్న దురభిప్రాయం కల్గి ప్రేమ పట్ల అనుచితంగా ప్రవర్తించేది. మారయ్య బయటి పనులతో ఇంటి వద్ద ఉండేవాడు కాదు.
11 సంవత్సరాల తర్వాత ఊళ్ళో స్కూళ్ళు ప్రారంభించారు. ఆంధ్ర దేశంలో అక్షరాస్యత ఉద్యమం జోరుగా సాగుతోంది. “ప్రతి ఒక్కరు చదువు కోవాలి”, “ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు”, “విద్యా దానం మహాదానం”, “విద్య లేని వాడు వింత పశువు”, “ఇంటింటా చదువు దేశానికి వెలుగు”. ”అందరూ చదవాలి, అన్యాయాలను ఎదిరించాలి”. అను నినాదాలు ప్రతిఒక్కరి చెవులలో మారు మ్రోగుతున్నాయి. “విధ్యేంది” గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ చిన్నా, పెద్దా తేడా లేకుండా, అక్షరాస్యతా ఉద్యమంలో పాల్గొని చదువు నేర్చుకుంటున్నారు.
కాని ఆ ఊరి పెద్ద మనిషి అయిన మారయ్య తన పెద్ద భార్య కుమార్తె ప్రేమను పాఠశాలకు పంపడం లేదు. కారణం అతని రెండవ భార్య చింతాంగి. ఈమె కసాయి హృదయురాలు. ప్రేమను ఏనాడు రెండుకళ్ళతో చూడలేదు.
ప్రేమ వయస్సు ఇప్పుడు 17 సం॥లు. చిన్నప్పటి నుంచి చదువు పట్ల ఆసక్తి ఉన్నా అమాయకంగా కనపడేది. బడికెళుతున్న వారిని చూసి “నాకు ఆ అదృష్టం లేదని” తనలో తాను మదనపడుతూ ఉండేది.
మారయ్య చాలా సహృదయుడు మరియు పిరికి వాడు. గ్రామంలో ఇతరులకు చాలా గంభీరంగా కనబడతాడు. తన రెండవ భార్య దగ్గర మాత్రం పిల్లిలా ప్రవర్తించేవాడు. ఓ రోజు ప్రేమ మనోవేదనను గ్రహించి, “చూడమ్మా .. ప్రేమ.. మీ పిన్నమ్మ నీకు ఈ ఊరిలో చదువు రానివ్వదు.. నీవు చదివితే ఏదో ప్రయోజకురాలు అవుతావనీ.. తనకు చదువు లేదని.. నీవు గొప్ప విద్యావంతురాలు అయితే.. తనను లెక్క చేయవని మూర్ఖత్వంతో నిన్ను ఇలా కష్టబెడుతుంది.. మీ అమ్మే బ్రతికి ఉంటే ఈ చింతాంగి నా భార్య అయ్యేదా..? నీకు ఈ గతి పట్టేదా..? పట్టేది కాదు… ఈ వేళకు ఇంటర్ చదువుతూ ఉండే దానివి..” అని చింతించిగ మనసులో ఒక మెరుపులాంటి ఆలోచన కలిగింది. “మీ పిన్ని వాళ్ల పుట్టింటికి పనిమీద వెళ్ళింది. రేపు ఉదయాన్నే .. నాతో బయలు దేరు. ఇదే సరైన సమయం తను చూసిందంటే నిన్ను నాతో ఎప్పటికీ పంపదు. హైదరాబాద్లో నా స్నేహితుడు హైస్కూలు హెడ్మాస్టర్ చాలా మంచి వాడు. నిన్ను అతని దగ్గర వుంచితే… నీ పట్టుదలకు.. ఆసక్తికి.. గొప్ప విద్యావంతురాలు అవుతావు. ఏకువ జామునే తయారవ్వు..” అని మారయ్య అనగానే ప్రేమకు గొప్ప ఉపశమనం కలిగి ‘అలాగే’ అని తలూపింది.
ఉదయం ఆ ఊరి మొదటి బస్సు హైదరబాద్ బస్సు వచ్చేవేళకు బయలుదేరుతారు.
బస్సు స్టేజి దగ్గర ఆగింది. మారయ్య, ప్రేమ బస్సెక్కారు. ఈ విషయం తెలుసుకున్న చింతాంగి అదే సమయానికి వచ్చి బయలు దేరుతున్న బస్సును, తన అనుచరుల చేత ఆపించింది. మారయ్య డ్రైవర్ను గదమాయించి “నీవు పోనివ్వు బస్సును” అన్నాడు. చింతాంగి మారయ్యతో “దీన్ని పట్టణానికి పంపి చదివించావంటే.. నీ పెద్ద భార్య ఆస్తి నాకు చిల్లిగవ్వంత కూడా రాదు.. అప్పుడు నీవు.. నేను.. నెత్తిన గుడ్డేసుకొని ఏడ్వాలి.. ముందు దిగు” అని కరిచినట్లుగా అరుస్తుంది. “ఛీ.. నీచురాలా.. నీవు కసాయిదానివే అనుకున్నాను.. కానీ ఇప్పుడు మెదడు లేని గ్రుడ్డిదానివని భావిస్తున్నాను” అన్నాడు మారయ్య అసహనంగా.
విషయం గ్రహించిన బస్సు డ్రైవర్ చింతాంగి మాటలు లెక్కచేయక ఆమెను క్రిందకు దించి బస్ స్టార్ట్ చేశాడు. ***
హెడ్ మాస్టర్ శాంతి స్వరూప్ చమత్కారి వినయశీలుడు మరియు ధర్మాత్ముడు. తన భార్యతో “ఏమే.. కాంతం.. ఎవరొచ్చారో చూడు.. మారయ్యను చూసి చాలా కాలం అయింది..” “అరే ప్రేమ ఎంత ఎదిగిపోయింది.. చూసి పదేండ్లయింది” అంటూ కాంతం వంటగదిలో నుంచి వచ్చి స్వాగతం పలికింది. మారయ్య వారి ఆప్యాయతకు కృతజ్ఞుడై ఆనంద భాష్పాలు రాల్చాడు. “రేయ్ ఏరా.. చిన్న పిల్లవాడిలా ఏడుస్తున్నావ్.. ఊరుకో.. పరిస్థితి నాకు అంతా తెలుసు.. నీకు నేను దూరంగా ఉన్నా పుట్టిన ఊరు విషయాలు.. అందులో నా ఆప్తుల సంగతులు తెలుసుకుంటూ ఉంటాను.. ప్రేమను బాగా చదివించి.. నా కోడల్ని చేసుకుంటాను” అని శాంతి స్వరూప్ అంటుండగా కాస్త స్థిమిత పడి “విజయ్ ఇప్పుడు ఏంచేస్తున్నాడు” అన్నాడు మారయ్య. ”వాడు పూణేలో ఆర్మీ కాలేజీలో డిగ్రీ జాయిన్ అయ్యాడు.. ఆర్మీలో చేరి దేశ రక్షణలో తన వంతు సేవ చేయాలని వాడి కోరిక.. నేను చేయలేని పని నా కుమారుడు చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది..” అంటూ భావోద్వేగం నుండి తేరుకుని “నీవు నిశ్చింతగా ఉండు” అన్నాడు స్వరూప్ ఓదార్పుగా. “ఏంటన్నయ్యా.. ప్రేమ నా కూతురు లాంటిది.. చింతాంగి చేతులో ఎంత నలిగిందో నాకు తెలుసు.. బాగా చదివించి, ఆ చింతాంగి కళ్ళు తెరిపిస్తాము.. పుట్టుగొడ్రాలు.. నీ కర్మ పట్టి ఆమెను పెళ్ళి చేసుకున్నావు” అంది కాంతం చింతాంగిపై అసహనంతో. “అవన్ని ఎందుకులే కాంతం.. ముందు మీ అన్నయ్యను ప్రేమను విశ్రాంతి తీసుకోనివ్వు.. అంత దూరం ప్రయాణం చేసి వచ్చారుగా.. ప్రేమ.. నీవు పైనున్న గది లో ఫ్రెష్అప్ అయ్యిరా” అంటూ శాంతి స్వరూప్ తన బుక్ స్టాండ్లో పెద్ద బాలశిక్ష తీసుకొని చదువుతున్నాడు.
“ఏరా స్వరూప్.. ఈ వయస్సులో నీకు పెద్ద బాలశిక్ష అవసరం ఏంటిరా” అన్నాడు మారయ్య. ”అదే నీకు.. నాకు.. తేడా.. దీనిలోని సారాంశాన్ని ప్రేమకు తెలియజెప్పాలి”.. కాంతం ప్రేమ ఫ్రెష్ అయి రాగానే అందరికీ వడ్డించు చాలా పని ఉంది. నేను అనుకున్నది నెరవేర్చాలి.. ప్రేమను ప్రయోజకరాలిని చేయాలి” అన్నాడు శాంతి స్వరూప్. ”అబ్బబ్బ అన్నయ్య.. ఇక ఈయన.. ప్రేమను డిగ్రీ చదివించినంత వరకు నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు”. నవ్వుతూ వినయంగా అంది కాంతం మారయ్యతో. “అమ్మా .. ప్రేమ భోంచేసిన తర్వాత ఈ రోజు బాగా విశ్రాంతి తీసుకో.. నీ విద్యాభ్యాసం రేపటి నుంచే మొదలెడతా” అన్నాడు శాంతి స్వరూప్ ప్రేమ ఫ్రెష్అయి రాగానే. “అలాగేనండి” అంది ప్రేమ వినయంగా అమాయకత్వపు చూపుతో. మధ్యాహ్నం భోజనం చేసి “అమ్మా ప్రేమ.. మాస్టర్ చెప్పినట్లు నడుచుకో” అని ప్రేమకు చెప్పి “మరి నేను వెళ్ళాస్తా స్వరూప్.. వెళ్ళొస్తాను కాంతమ్మా..” అని విద్యేందికి బయలు దేరాడు మారయ్య. అతని పరిస్థితి తెలిసిన కాంతం, స్వరూప్ కనీసం ఆ రోజంతా కూడా ఉండమని చెప్పనందుకు చింతించి ప్రేమ భవిష్యత్తుకై తమ దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
***
ఆరోజు రాత్రికి తన ఇంటికొచ్చిన మారయ్య పామువలె బుసలు కొడుతున్న చింతాంగిని ఏ మాత్రం పలకరించకుండా తన పనులు తానే చేసుకుంటూ జీవితం కొనసాగించాలని అనుకున్నాడు.
మరునాడు ఉదయం 5 గం॥లకు అలార్మ్ మ్రోగింది వెంటనే శాంతి స్వరూప్ నిద్రలేచి ప్రేమకు సంబంధించిన విద్యాభ్యాస ప్రణాళికను తయారు చేశాడు. 6 గంటలకు ప్రేమను నిద్రలేపాడు. ఆ రోజు అక్షరమాలను పెద్ద బాలశిక్ష సారాంశాన్ని నేర్పించాడు. దీనికి ప్రేమ యొక్క ఆసక్తి, ఏకాగ్రత, పట్టుదల మరియు స్వరూప్ యొక్క సులభ బోధనాశైలి దోహదపడ్డాయి. 10వ తరగతిలోపు విద్యాంశాలను 10 రోజులలో ప్రేమ నేర్చుకున్నది. శాంతి స్వరూప్ అతని స్నేహితులయిన ఇతర ఉద్యోగస్తులు కూడా, ప్రేమ తెలివి తేటలకు ఆశ్చర్య పోయారు. తెలిసిన ప్రతివారి నుంచి ప్రశంసలు వచ్చాయి. శాంతి స్వరూప్ హృదయం ఆనందంతో ఉప్పొంగి పోయింది. అందరి అభినందనలతో ప్రేమను తను పనిచేస్తున్న స్కూల్లో 10వ తరగతిలో చేర్చాడు.
కాంతం ప్రేమను తన కుమార్తెలా చూసుకొంటోంది. ప్రేమ పదవ తరగతి సంవత్సర పరీక్షలు వ్రాసి 90 శాతం మార్కులు సంపాదించింది.
ఈ విషయం తెలిసిన తండ్రి మారయ్య సంతోషించాడు. “ఆc.. ఆ.. చదివింది చాలు ఇకనయినా ఇంటికి తీసుకురండి” అంది పైకి ప్రేమున్నట్లుగ చింతాంగి. ఈమె అంతర్గత భావన తెలిసిన మారయ్య వినిపించకోక తన కుమార్తె గొప్ప పండితురాలవుతుందని భావించి మనసున కొండనెత్తినంతగ ఆనందించాడు. ***
శాంతి స్వరూప్ సహకారంతో మారయ్య ప్రోత్సాహంతో ప్రేమ B.A. డిగ్రీ పుచ్చుకొని సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు వ్రాసి 3వ ర్యాంక్ సాధించింది. సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ I.A.S. ఇంటర్వూకు కాల్ లెటర్ వచ్చింది. శాంతి స్వరూప్ ఎంతో ఆనందించాడు. “అమ్మా ప్రేమ నీకు ఇంటర్యూ వచ్చింది. నీవు తప్పకుండా కలెక్టరు అవుతావు” అన్నాడు. ప్రేమ ఆనందానికి హద్దులు లేవు. తన చనిపోయిన అమ్మను గుర్తుకు తెచ్చుకొని మౌనముగా ఉండిపోయింది … మరుసటి రోజు ఉదయం 10 గం॥లకు ఇంటర్వూ. ఇంటర్వ్యూ హాల్ లో, బెల్ మ్రోగింది ప్రేమకు ఎంత ప్రతిభ ఉన్నా బోర్డు సభ్యులను చూసి కొద్దిగ జంకింది. ఇంటర్వూ బోర్డ్ సభ్యులు ప్రేమను చూసి ఆమె బాహ్య రూపం అమాయకంగా కన్పించుట వలన తక్కువగా అంచనా వేసి, మొదట చిన్న ప్రశ్నలు అడిగారు. ” నీవు వ్రాసిన ప్రవేశ పరీక్షలో మొదటి ప్రశ్న ఏదీ?, “జర్మనీలో నాజీజమ్ స్థాపకుడు ఎవరు?” “హిట్లర్” అంది ప్రేమ. “వెరీగుడ్” అన్నాడు ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడు ఒకరు. ఈమె చురుకైన జవాబులు విన్న బోర్డు సభ్యులు పెద్ద ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు. “ప్రతి మనిషికి ఉండాల్సిన ధ్యేయం ఏమిటి?” “ప్రతి మనిషి.. తనకు ఏ రంగం ఇష్టమో.. దానిలో రాణించాలనే అభిలాషను ధ్యేయంగా పెట్టుకోవాలి.. దానికి ఉదాహరణ నేనే” అని క్లారిటీగా.. ధీమాగా చెప్పింది ప్రేమ. ప్రేమ కార్యదీక్షను సంకల్ప బలాన్ని అంచనా వేసి యుకెన్ గో” అని నోట్చేసుకున్నారు ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యులు. ***
ఇంటర్వ్యూలో ఫుల్ మార్క్స్ రావడం ద్వారా ప్రేమ కలెక్టరయింది. శాంతి స్వరూప్ కుమారుడు రాజస్థాన్ ఆర్మీలో శిక్షణ పొంది ఆర్మీ కెప్టెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. స్వరూప్ తన కుమారుడు విజయ్ ను వీలైతే పర్మిషన్ తీసుకుని హైద్రాబాద్కు రమ్మని ఫోన్ చేశాడు. ప్రేమ స్టోరి విన్న విజయ్ అంతటి ప్రతిభ ఉన్న ప్రేమను వివాహం చేసుకోవడానికి సందేహించాడు. అయినా ప్రేమ తన మాస్టర్ శాంతి స్వరూప్ను దైవంగా పూజించి నేడు ఈ స్థాయికి చేరుకోవడం.., విజయం సాధించడం వలన ఆయన కోరిక మేరకు ఆమె శాంతి స్వరూప్ కోడలయింది. తర్వాత కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రేమ తన పిన్నమ్మ చింతాంగిని కూడా తన బంగ్లాకు ఆహ్వానించింది. ఈ అనుకూల మార్పులకు మారయ్య ఆనందానికి అవధులు లేవు. తమ ఊరి వారందరికీ విషయం చెప్ప సాగాడు అందరి అభినందనలతో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. ప్రేమ తన ఆస్తిని చింతాంగి పేర వ్రాసిచ్చింది. ప్రేమ హృదయ పరిమళాన్ని శ్వాసించిన చింతాంగి క్షమించమని అడగడానికి కూడా నోరు రాక ఆస్తి పేపర్లను చింపేసి తను ప్రవర్తించిన విధానానికి తీవ్రంగా చింతించి పశ్చాతాపంతో ప్రేమపై ఉప్పొంగిన ప్రేమను చూపించాలని ప్రేమకు ముద్దు పెట్టాలన్నా ధైర్యం చాలలేదు. ఈమె మనోభావాన్ని అర్థం చేసుకున్న ప్రేమ తన పిన్నిని దగ్గర తీసి కౌగిలించుకున్నది. తర్వాత తన గురించి, తన విద్య ప్రతిభ గురించి తెలుసుకున్న ప్రభుత్వం సేవా ప్రతిభ ‘అవార్డును’ ప్రధానం చేసింది. తన విజయానికి కారణం ఎవరని పత్రికా విలేకరులు అడుగగా శాంతి స్వరూప్ మాస్టర్ అని చెప్పింది. అతని బోధన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తో శాంతి స్వరూప్ ని గౌరవించింది. ఈ సందర్భంగా ప్రేమకు ఘనంగా సన్మానం చేయాలని రాష్ట్ర యువసేన నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తిగా పాల్గొన్న శాంతి స్వరూప్ మాట్లాడుతూ ”ఎన్నో అవకాశాలు ఉన్నా.. ఎంత డబ్బయినా ఖర్చు పెడతాం.. అని తల్లిదండ్రులు ముందుకొచ్చినా.. తమ బిడ్డలు కొంతమంది చదువు పట్ల నిర్లక్ష్యం చూపుతున్న ఈ రోజుల్లో.. ప్రేమ తాను చిన్నప్పటి నుంచి 17 సంవత్సరాల వరకు ‘అ, ఆ’లు కూడా సరిగా రాని పరిస్థితి ఉన్నప్పటికి అత్యంత ఏకాగ్రతతో, పట్టుదలతో, ఆసక్తితో డైరెక్టుగా పదవ తరగతి చదివి, నేడు కలెక్టర్ అయిందంటే.. ఇది ఆమె స్వయంకృషి తపసిద్ధి కారణం. ఇది ఆంధ్ర చరిత్రలో ” ప్రేమ తపస్సుగా మిగిలి పోతుంది” అని వక్కాణించాడు. విద్వేంది గ్రామాన్ని ఆ గ్రామ ప్రజలు ప్రేమపట్ల ప్రేమాభిమానంతో ‘ప్రేమూరు’ గా మార్చారు.

@శుభం@

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.