కామారెడ్డి, 15 అక్టోబర్, పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం పాడిపశువులలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. మండల పశువైద్య అధికారి డా. రాంచందర్ తెలి పారు. ఈ కార్యక్రమం ఈరోజు నుండి నవంబర్ 14 వరకు మండలంలోని ప్రతి గ్రామంలో కొనసాగనుం ది.డా. రాంచందర్ మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి ఒక పశువు నుండి మరొక పశువుకు గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఇది పాడి రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ వ్యాధి నివారణకు టీకా వేయడం ఒక్కటే సమర్థవంత మైన మార్గమని పేర్కొన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ టీకాలను అన్ని పాడిపశువులకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. రైతులు ఈ సదావకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.మండల కేంద్రంలో జరిగిన మొదటి రోజు కార్యక్రమంలో 30 గోజాతి మరియు 360 గేదె జాతి పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస రావు, విఎల్ఓ నారాయణ, జేఎఓ, రమేష్, వీఏ బాలమ ని, దశరథ్, హారిక, రవీందర్ రెడ్డి స్వామి,గ్రామాని కి చెందిన పాడి రైతులు పాల్గొన్నారు


