Thursday, 26 March 2026
  • Home  
  • ప్రారంభమైన ఎస్. బి.ఐ. టి ఆరోహన్ 2026 వేడుకలు.
- ఖమ్మం

ప్రారంభమైన ఎస్. బి.ఐ. టి ఆరోహన్ 2026 వేడుకలు.

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) స్థానిక ఎస్. బి.ఐ. టి కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఆరోహన్ 2026 గోడ పత్రిక ఆవిష్కరణతో ప్రారంభమైనట్లు కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. గురువారం విద్యార్థులు అధ్యాపకుల ఆటపాటలతో లాంఛనంగా వేడుకలు ఆరంభించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరము నిర్వహించే అనవాయితీకి కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా ప్రాజెక్ట్ ఎక్స్ పో, టెక్నికల్ ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించబోతున్నట్లు కృష్ణ తెలిపారు. టెక్నికల్ ఫెస్ట్స్ విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాలు మరియు భవిష్యత్తును మెరుగుపరచే ఒక మంచి వేదిక అని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డా||జి. ధాత్రి తెలిపారు.విద్యార్థులలోని శారీరిక మానసిక వికాసానికి, సృజనాత్మకతను పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని తెలిపారు. విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపకులు సైతం ఉత్సాహంగా ఆట పాటలలో పాల్గొని కార్యక్రమానికి శోభను చేకూర్చినట్లు కళాశాల వైస్ చైర్మన్ కే.శ్రీచైతన్య తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డా|| జి. రాజ్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ 3,4 తారీఖులలో ఆరోహాన్ 2026 నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. 3వ తారీఖున ప్రాజెక్ట్ ఎక్స్ పో తో పాటు టెక్నికల్ ఈవెంట్స్ నివరహించి 4వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలతో కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి విభాగం నుండి వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాస్ రావు, డా|| ఏ. వి. వి.శివ ప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

స్థానిక ఎస్. బి.ఐ. టి కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఆరోహన్ 2026 గోడ పత్రిక ఆవిష్కరణతో ప్రారంభమైనట్లు కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. గురువారం విద్యార్థులు అధ్యాపకుల ఆటపాటలతో లాంఛనంగా వేడుకలు ఆరంభించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరము నిర్వహించే అనవాయితీకి కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా ప్రాజెక్ట్ ఎక్స్ పో, టెక్నికల్ ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించబోతున్నట్లు కృష్ణ తెలిపారు.

టెక్నికల్ ఫెస్ట్స్ విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాలు మరియు భవిష్యత్తును మెరుగుపరచే ఒక మంచి వేదిక అని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డా||జి. ధాత్రి తెలిపారు.విద్యార్థులలోని శారీరిక మానసిక వికాసానికి, సృజనాత్మకతను పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని తెలిపారు. విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపకులు సైతం ఉత్సాహంగా ఆట పాటలలో పాల్గొని కార్యక్రమానికి శోభను చేకూర్చినట్లు కళాశాల వైస్ చైర్మన్ కే.శ్రీచైతన్య తెలిపారు.

కళాశాల ప్రిన్సిపల్ డా|| జి. రాజ్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ 3,4 తారీఖులలో ఆరోహాన్ 2026 నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. 3వ తారీఖున ప్రాజెక్ట్ ఎక్స్ పో తో పాటు టెక్నికల్ ఈవెంట్స్ నివరహించి 4వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలతో కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి విభాగం నుండి వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాస్ రావు, డా|| ఏ. వి. వి.శివ ప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.