నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ తిప్పర్తి ధాన్యం కొనుగోలు కేంద్రానికి గత సంవత్సరం 75 వేల మెట్రిక్ టన్నుల కొన్న చరిత్ర ఉందని,రైతులు నాణ్యతతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తేవాలని, ధాన్యంలో తేమ ఎక్కువగా లేకుండా, 17%
మిం చకుండా తీసుకొని రావాలని, ధాన్యం అమ్మిన రైతులకు 72 గంటల్లో చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రెండు డ్రయర్లను ఏర్పాటు చేయగా, ఒకటి తిప్పర్తిలో, మరొకటి మిర్యాలగూడలో ఏర్పాటు చేయడం జరిగిందని డ్రయర్ల పై రైతులకు అవగాహన కల్పించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 100 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్నదని తెలిపారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ తిప్పర్తి ధాన్యం కొనుగోలు కేంద్రానికి గత సంవత్సరం 75 వేల మెట్రిక్ టన్నుల కొన్న చరిత్ర ఉందని,రైతులు నాణ్యతతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తేవాలని, ధాన్యంలో తేమ ఎక్కువగా లేకుండా, 17% మిం చకుండా తీసుకొని రావాలని, ధాన్యం అమ్మిన రైతులకు 72 గంటల్లో చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రెండు డ్రయర్లను ఏర్పాటు చేయగా, ఒకటి తిప్పర్తిలో, మరొకటి మిర్యాలగూడలో ఏర్పాటు చేయడం జరిగిందని డ్రయర్ల పై రైతులకు అవగాహన కల్పించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 100 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్నదని తెలిపారు.

