Tuesday, 24 March 2026
  • Home  
  • ప్రాణ నష్టం తగ్గాలంటే యువత వేగాన్ని తగ్గించాలి మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు
- అన్నమయ్య

ప్రాణ నష్టం తగ్గాలంటే యువత వేగాన్ని తగ్గించాలి మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు

చిట్వేలి జూలై 19 (పున్నమి ప్రతినిధి) ప్రమాదాలను అరికట్టాలంటే యువత వేగాన్ని తగ్గించాలని అప్పుడే ప్రమాదాలను అరికట్టవచ్చు లేకపోతే ప్రమాదాల బారిన పడి కుటుంబాలు బాధాకరంగా మారుతున్నాయని. మైనర్ లకు వాహనాలు ఇచ్చి వారు ప్రమాదాల బారిన పడి బాధపడే కన్నా వారికి వాహనం ఇవ్వకుంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని విచ్చలవిడిగా తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే మైనర్ తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయబడతాయని చిట్వేలి ఎస్సై నవీన్ వెల్లడించారు. ఈ సందర్భంగా శనివారం, పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇస్తానుసారంగా తిరిగే వారిపై నిఖాపట్టామన్నారు. నిబంధనలు పాటిస్తూ ప్రతి వాహనదారుడికి వాహన పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ ధరించడం కారుకు సీట్ బెల్ట్ పెట్టుకుని కారు నడపడం మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అన్న నిబంధనలను తెలుసుకోవాలన్నారు. అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. పోలీసులు ఫ్రెండ్లీ పోలీసెనని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ప్రజల పట్ల పోలీసులు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదని ప్రజలకు ఫ్రెండ్లీగా ఉంటూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవలసిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా విధులు మేము నిర్వహిస్తామని మాకు సహకరించాలన్నారు. అధిక లోడు వాహనాలపై మనుషులను కూర్చోపెట్టుకొని ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆటోలో ఎంతమందిని కూర్చోబెట్టాలని ఆ నిబంధన మేరకే ఆటో నడపాలని అంతకుమించి పదిమంది 20 మందిని ఆటోలో ఎక్కించి తిరిగితే చట్టపరమైన చర్యలు తప్పమన్నారు. ప్రధాన రహదారి పాత బస్టాండ్ లో ట్రాఫిక్ ఫై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అలాగే సాయంత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వదిలినప్పుడు విద్యార్థినీలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా బైక్ రేస్ చేస్తూ వచ్చే ఆకతాయిలపై నిఖా పెట్టామన్నారు. అటువంటి వారు కంటపడితే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. ఈ సందర్భంగా మండలంలోని 21 గ్రామపంచాయతీ లోని పరిస్థితులను క్షుణ్ణంగా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిట్వేలి జూలై 19 (పున్నమి ప్రతినిధి)
ప్రమాదాలను అరికట్టాలంటే యువత వేగాన్ని తగ్గించాలని అప్పుడే ప్రమాదాలను అరికట్టవచ్చు లేకపోతే ప్రమాదాల బారిన పడి కుటుంబాలు బాధాకరంగా మారుతున్నాయని. మైనర్ లకు వాహనాలు ఇచ్చి వారు ప్రమాదాల బారిన పడి బాధపడే కన్నా వారికి వాహనం ఇవ్వకుంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని విచ్చలవిడిగా తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే మైనర్ తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయబడతాయని చిట్వేలి ఎస్సై నవీన్ వెల్లడించారు. ఈ సందర్భంగా శనివారం, పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇస్తానుసారంగా తిరిగే వారిపై నిఖాపట్టామన్నారు. నిబంధనలు పాటిస్తూ ప్రతి వాహనదారుడికి వాహన పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ ధరించడం కారుకు సీట్ బెల్ట్ పెట్టుకుని కారు నడపడం మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అన్న నిబంధనలను తెలుసుకోవాలన్నారు. అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. పోలీసులు ఫ్రెండ్లీ పోలీసెనని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ప్రజల పట్ల పోలీసులు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదని ప్రజలకు ఫ్రెండ్లీగా ఉంటూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవలసిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా విధులు మేము నిర్వహిస్తామని మాకు సహకరించాలన్నారు. అధిక లోడు వాహనాలపై మనుషులను కూర్చోపెట్టుకొని ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆటోలో ఎంతమందిని కూర్చోబెట్టాలని ఆ నిబంధన మేరకే ఆటో నడపాలని అంతకుమించి పదిమంది 20 మందిని ఆటోలో ఎక్కించి తిరిగితే చట్టపరమైన చర్యలు తప్పమన్నారు. ప్రధాన రహదారి పాత బస్టాండ్ లో ట్రాఫిక్ ఫై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అలాగే సాయంత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వదిలినప్పుడు విద్యార్థినీలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా బైక్ రేస్ చేస్తూ వచ్చే ఆకతాయిలపై నిఖా పెట్టామన్నారు. అటువంటి వారు కంటపడితే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. ఈ సందర్భంగా మండలంలోని 21 గ్రామపంచాయతీ లోని పరిస్థితులను క్షుణ్ణంగా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.