ప్రజల ప్రాణాలు బలి అవుతున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం:
మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా అక్టోబర్ 31 ( పున్నమి న్యూస్ ప్రతినిధి ):కడప నుండి తిరుపతి కి నిత్యం తిరుపతిలోని ఆసుపత్రులకు,తిరుమలకు, చెన్నైకు పలు దేవాలయాలకు,వెళ్లే ప్రధాన రహదారి అయిన ఎన్ హెచ్ఐఏ 716 ముఖ్యంగా కోడూరు నుండి రోడ్లు గుంతలమయం అయ్యి మరింత అద్వానంగా ఉండడంతో చాలామంది ప్రయాణికులకు, ముఖ్యంగా వృద్ధులు పసిపిల్లలు, బాలింతలు గర్భవతులు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉన్నదని, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతూ ఎంతోమంది ప్రాణాలు పోయినా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేకుండా ఉండడంతో అక్టోబర్ 31 శుక్రవారం నాడు ముందుగా గత ప్రభుత్వం లో వేసిన రోడ్లను పరిశీలిస్తూ నాటికి ఇప్పటికీ తేడా చూడాలంటూ రైల్వే కోడూరు మండల పరిధిలోని ఉప్పరపల్లి నుండి మాధవరంపోడు జ్యోతి నగర్ వరకు నడుచుకుంటూ రహదారిని టేపుతో కొలతలు వేసి ఒక్కో గుంత 15 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పుతో గుంతలమైమైనా రోడ్లను పరిశీలించి అనంతరం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో ఇటువంటి సమస్యను అప్పుడే గ్రహించి రాజంపేట పార్లమెంటు సభ్యులు పీవీ మిథున్ రెడ్డి సహకారం తో నియోజకవర్గం లోని ముఖ్య నాయకులతో కలిసి అనేకమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి 2700 కోట్ల రూపాయలతో కడప నుండి రేణిగుంట వరకు గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే రహదారి పనులు మంజూరు చేయించుకోగా తర్వాత ఎన్నికల రావడం ప్రభుత్వాలు మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న పనులు మొదలు పెట్టకపోవడం దౌర్భాగ్యమని నిత్యం ఎంతోమంది ప్రమాదాలు బారిన పడి ప్రాణాలు పోతున్న, ఇటీవల పలువురు యువకులు వారి యొక్క సోషల్ మీడియా ఖాతాల్లో ఈ రోడ్డుపైన విశ్లేషించి ప్రభుత్వ పెద్దలని ప్రశ్నించినందుకు వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వారి యొక్క సొంత లాభాల కోసం చూపించే శ్రద్ధ ప్రజలపై చూపిస్తే బాగుంటది అని ఇప్పటికైనా మొద్దు నిద్రలేచి కళ్ళు తెరిచి కనీసం తాత్కాలికంగా ప్యాచ్అప్ పనులు జరిపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని.లేనియెడల ప్రతి పంచాయతీలోని ప్రజలను తీసుకొచ్చి నేషనల్ హైవేపైనే భారీ రాస్తారోకో కు దిగుతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన కొరముట్ల శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల వైఎస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజా రెడ్డి, ఉప సర్పంచ్ శివ సాయి, సర్పంచ్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నంద బాల, సర్పంచ్ ఈశ్వరయ్య యాదవ్, శ్రీరామ్ వినోద్,ఎంపీటీసీ బండారు మల్లికార్జున,ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, అరుణమ్మ, రాజగోపాల్, గల్లా శ్రీను, సుబ్బరాయుడు, శంకరయ్య, యనమాల చైతన్య,రాజా, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


