.
ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
రైతుల ప్రాణాలను కాపాడటానికి ప్రాణాంతకమైన పరాక్వాట్ విషాన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద గురువారం ప్రజా అవగాహన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ రక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
పంటల్లో వినియోగించే పరాక్వాట్ విషం వల్ల అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనమని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రాణాలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరాక్వాట్‌పై పూర్తి నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ అవగాహన బొలికొండ శ్రీనివాసరావు, కంభంపాటి నారాయణరావు, కన్నెవేటి సతీష్ నారాయణ చౌదరి, గజ్జల శ్రీనివాస్, కమలాకర్ శ్రీకాంత్, అరుణ్ కుమార్, నాగేశ్వరరావు, మణికాంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు మరియు ప్రజల్లో పరాక్వాట్ విషం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.


