నిర్మల్ జిల్లా: (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి గడ్డెన్న సుద్ద వాగు ప్రాజెక్టుకి ఉన్న 8 గేట్లకి గాను శనివారం ఐదు గేట్లు ఎత్తేయడంతో సందర్శకులు తాకిడి ఎక్కువయింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముందుగా ఒక్క గేటు ద్వారా నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినప్పటికీ వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో 3గేట్ల ద్వారా 15000 క్యూసెక్కుల నీటిని వదిలారు. చివరికి 5 గేట్ల ద్వారా 20000 క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేశారు. సుద్ద వాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందే తెలియజేసారు. అలా 5 గేట్లు ఎత్తేయడంతో జలాశయం వద్ద నీటి ప్రవాహ పరవళ్ళను చూసేందుకై వచ్చిన సందర్శకుల తాకిడి కనిపించింది.

ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో పెరిగిన సందర్శకుల తాకిడి