ప్రయాణికుల భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై పోలీసులు, రవాణా శాఖ మరియు అగ్నిమాపక శాఖల సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. ఈ తనిఖీలలో వాహనాల ఫిట్నెస్, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు, డ్రైవర్ల లైసెన్సులు, బీమా పత్రాలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి బస్సు నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.


