Monday, 16 March 2026
  • Home  
  • ప్రయాణికుల దాహార్తి తీర్చిన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్
- కర్నూలు

ప్రయాణికుల దాహార్తి తీర్చిన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్

కర్నూలు (పున్నమి ప్రతినిధి) వేసవి తాపం, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ అభినందనీయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ బూర్లీ సతీష్ గారు మరియు స్టేట్ చైర్మన్ ఎం. సాయి గారి ఆదేశాల మేరకు స్థానిక ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులకు, బాటసారులకు మరియు విధుల్లో ఉన్న సిబ్బందికి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ​ఈ సేవా కార్యక్రమం కర్నూల్ డిస్ట్రిక్ట్ డీఓసీ (DOC) లావణ్య గారి ఆధ్వర్యంలో అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. సామాజిక బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా విద్యార్థులే ప్రయాణికుల వద్దకు వెళ్లి మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లను అందించడం అందరినీ ఆకర్షించింది. ​ఎండలో ప్రయాణిస్తూ అలసిపోయిన తమకు చల్లటి మజ్జిగ, నీరు అందించి దాహార్తిని తీర్చిన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ప్రతినిధులను, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను ప్రయాణికులు, స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు. Uploaded Video:

కర్నూలు (పున్నమి ప్రతినిధి)
వేసవి తాపం, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ అభినందనీయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ బూర్లీ సతీష్ గారు మరియు స్టేట్ చైర్మన్ ఎం. సాయి గారి ఆదేశాల మేరకు స్థానిక ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులకు, బాటసారులకు మరియు విధుల్లో ఉన్న సిబ్బందికి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
​ఈ సేవా కార్యక్రమం కర్నూల్ డిస్ట్రిక్ట్ డీఓసీ (DOC) లావణ్య గారి ఆధ్వర్యంలో అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. సామాజిక బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా విద్యార్థులే ప్రయాణికుల వద్దకు వెళ్లి మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లను అందించడం అందరినీ ఆకర్షించింది.
​ఎండలో ప్రయాణిస్తూ అలసిపోయిన తమకు చల్లటి మజ్జిగ, నీరు అందించి దాహార్తిని తీర్చిన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ప్రతినిధులను, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను ప్రయాణికులు, స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.