విశాఖపట్నం మార్చి (పున్నమి ప్రతినిధి)
సముద్రంలో మత్స్య వేటకు వెళ్లి మృతిచెందిన బోయివీధికి చెందిన సురివిన వీర్రాజు కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం తగరపువలసలో అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ప్రమాదంలో మృతిచెందిన ఆనందపురం మండలం బోని గ్రామానికి చెందిన కనకల ప్రసాద్ కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ఎంవీపీ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.



