ప్రమాదపు అంచుల్లో ప్రయాణికులు
నిద్రావస్థలో ఆర్ అండ్ బీ అధికారులు
పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్
ఖమ్మం, 05 నవంబర్ 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోడ్లు అన్ని ధీనవస్థలో, ప్రమాదకరంగా దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ను, కొత్తగూడెం జిల్లాను కలిపే ప్రధాన రహదారి లో ఏన్కూర్ నుండి జూలూరుపాడు మధ్యలో ఉన్న రోడ్డు అడుగు లోతుల్లో పెద్ద పెద్ద గుంతలతో, రోడ్డు అంచులు పగిలిపోయాయి. కొన్ని చోట్ల అసలు రోడ్డు కనపడని పరిస్థితి. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వర్షపు నీళ్లతో నిండిపోయి, రోజుకి పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. స్థానిక శాసనసభ్యులు రోజు ఇదే రహదారిలో ప్రయాణిస్తున్న కూడా రోడ్డు దుస్థితి అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారు. వందల పెద్ద పెద్ద వాహనాలు రోజు ఇదే రహదారి మీద ప్రయాణం చేస్తాయి. మంత్రులు, ఎమ్మెల్యే లు కూడా ఇదే రహదారిలో ప్రయాణించిన కూడా నిమ్మకు నీరెతనట్టు పట్టించుకోని దుస్థితి. ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగి అందులో ఒక ప్రమాదంలో ఒక నిండు ప్రాణం పోయింది. ఇంకెన్ని ప్రమాదాలు జరగాలి. ఇంకెన్ని దారుణాలు చూడాలి. ప్రాణాలు పోతున్నా కూడా అధికారులు పట్టించుకోరా. మరో దారుణం జరిగి ఇంకో ప్రాణం చేజారి పోకముందే ఇకనైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, స్థానిక శాసనసభ్యులు ఈ విషయం గురించి పునరాలోచన చేసి తగిన న్యాయం జరిగేలా చూడాలని వాహనదారులు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…


