ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11
ప్రభుత్వ వైద్యశాలకు 2000 చిరంజీలు అందజేత:
ఏన్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో చిరంజీలు లేకపోవడంతో ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ B. రాములు గారు మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు గుడ్ల వెంకటేశ్వరరావు గారికి సమాచారం ఇవ్వడంతో శనివారం ఏనుకూరు మండల మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 బాక్సులు 2 ML చిరంజీలు సుమారు 5000 రూపాయల ఖరీదైన చిరంజీలను ప్రభుత్వ వైద్యశాలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాధికారి భూక్య రాములు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో చిరంజీలు కొరత ఉన్నదని అడగగానే 2000 చిరంజీలు అందజేసిన మెడికల్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో కూడా వైద్యశాలకు రహదారి సమస్య ఉంటే మెడికల్ అసోసియేషన్ మండల అధ్యక్షులు గుడ్ల వెంకటేశ్వరరావు తన సొంత ఖర్చులతో రోడ్డు రిపేరు చేయించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ వేదమణి, ఫార్మసిస్ట్ నీరజ, ల్యాబ్ టెక్నీషియన్ ఉప్పెర్ల రమణ, మధు, మెడికల్ అసోసియేషన్ మండల అధ్యక్షులు గుడ్ల వెంకటేశ్వరరావు, పి.పాపారావు, కోపేల రామారావు, షేక్ హుస్సేనుద్దీన్, షేక్ పెంట్టు సాహెబ్, శివ, షేక్ జానీ, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


