రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరణ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగింది.
ఈ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
“ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడేందుకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించాలనే కుట్రను అడ్డుకునే దిశగా ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులపాటు కొనసాగనుంది. ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు అందరూ ఈ సంతకాల యజ్ఞంలో భాగస్వాములు కావాలి,” అన్నారు.
అలాగే ఆయన ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ని ఉద్దేశించి
“బీజేపీ పాలనలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించలేదు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇలాంటి నిర్ణయం? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల చిన్న చూపు కాదా?” అని సూటిగా ప్రశ్నించారు.
తదుపరి ఆయన మాట్లాడుతూ —
“తురకపాలెం, కురుపాం వంటి ప్రాంతాల్లో వైద్య సదుపాయాల లేమితో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలు పూర్తయ్యుంటే, అక్కడే వారికి వైద్యం అందేది,” అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, సాడి పద్మారెడ్డి, కె.అనిల్ కుమార్ రాజు, బర్కత్ అలీ, శశికళ, సేనాపతి అప్పారావు, కిరణ్ రాజు, పీలా వెంకటలక్ష్మి, యం.సునీల్ కుమార్, నీలి రవి, కర్రీ రామారెడ్డి, గుజ్జు వెంకటరెడ్డి, పైడి రమణ, బొడ్డెటి కిరణ్, బలిరెడ్డి గోవింద్, సుకుమార్, దల్లి రామకృష్ణ రెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


