అంబేద్కర్ కోనసీమ సెప్టెంబర్(పున్నమి ప్రతినిధి)
పి. గన్నవరం నియోజకవర్గం మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలకు నమస్కారం. పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం ఉదయం 9:30 గంటలకు అమలాపురం ఈదరపల్లిలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టబడుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనుబంధ విభాగాల నేతలు, దళిత సంఘాలతో కలిసి సమన్వయంగా పాల్గొనమని అభ్యర్థిస్తున్నాం.
– గన్నవరపు శ్రీనివాసరావు, కోఆర్డినేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.


