Monday, 8 December 2025
  • Home  
  • ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అయితే సామాన్యులకు వైద్య విద్య అందని ద్రాక్ష కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాట్లాడిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
- అల్లూరి సీతారామరాజు

ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అయితే సామాన్యులకు వైద్య విద్య అందని ద్రాక్ష కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాట్లాడిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

డుంబ్రిగుడ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:19 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అరకులోయ నియోజకవర్గం, డుంబ్రిగుడ మండలంలోని కొల్లాపూట్, కొర్రాయి గ్రామ పంచాయతీలలో ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో నిర్వహించింది. దీనిలో భాగంగా ఆదివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆద్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గత మా వైసీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నగదుతో నిర్మిస్తే, నేడు కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్న ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం దారుణమని అన్నారు. ప్రజల పన్నులతో కడుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పుతున్న తరుణంలో, పేద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అయితే సామాన్య, పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే లక్ష్యంతో ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని సంకల్పించారన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నడపాలనే ఉద్దేశంతో ఈ కోటి సంతకాలు మరియు రచ్చబండ కార్యక్రమం ఉద్దేశ్రమని ఎమ్మేల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీల ప్రజలు పంచాయితీలలో పలు సమస్యలపై ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందించడం ఈ కార్యక్రమంలో వైసీపీ డుంబ్రిగూడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురాం, డుంబ్రిగూడ మండలం వైస్ ఎంపీపీలు పంచాడి లలిత కుమారి గారు,శెట్టి ఆనంద్, మండల సర్పంచులు ఫోరం అధ్క్షులు కిముడు హరి, గుమ్మ నాగేశ్వరరావు, పట్టేదొర రామ్మూర్తి, డుంబ్రిగూడ మండల సూపర్ జడ్పీటీసీ చాటారీ కృష్ణారావు, డుంబ్రిగూడ మండల సూపర్ ఎంపీపీ బాకా సింహాచలం, వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి పాంగి నరసింగరావు, వైసీపీ డుంబ్రిగూడ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు చిక్కుడు మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి మట్టం శంకర్, దశమి, గ్రామస్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

డుంబ్రిగుడ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:19
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అరకులోయ నియోజకవర్గం, డుంబ్రిగుడ మండలంలోని కొల్లాపూట్, కొర్రాయి గ్రామ పంచాయతీలలో ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో నిర్వహించింది. దీనిలో భాగంగా ఆదివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆద్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గత మా వైసీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నగదుతో నిర్మిస్తే, నేడు కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్న ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం దారుణమని అన్నారు.
ప్రజల పన్నులతో కడుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పుతున్న తరుణంలో, పేద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అయితే సామాన్య, పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే లక్ష్యంతో ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని సంకల్పించారన్నారు.
మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నడపాలనే ఉద్దేశంతో ఈ కోటి సంతకాలు మరియు రచ్చబండ కార్యక్రమం ఉద్దేశ్రమని ఎమ్మేల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీల ప్రజలు పంచాయితీలలో పలు సమస్యలపై ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందించడం
ఈ కార్యక్రమంలో వైసీపీ డుంబ్రిగూడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురాం,
డుంబ్రిగూడ మండలం వైస్ ఎంపీపీలు పంచాడి లలిత కుమారి గారు,శెట్టి ఆనంద్, మండల సర్పంచులు ఫోరం అధ్క్షులు కిముడు హరి, గుమ్మ నాగేశ్వరరావు, పట్టేదొర రామ్మూర్తి, డుంబ్రిగూడ మండల సూపర్ జడ్పీటీసీ చాటారీ కృష్ణారావు, డుంబ్రిగూడ మండల సూపర్ ఎంపీపీ బాకా సింహాచలం, వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి పాంగి నరసింగరావు, వైసీపీ డుంబ్రిగూడ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు చిక్కుడు మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి మట్టం శంకర్, దశమి, గ్రామస్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.