నంద్యాల స్థానిక రాజకీయాలు మరియు విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సాధించే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఈ రోజు నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న బిల్డింగ్ అభివృద్ధి పనుల పురోగతిని ఫయాజ్ క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల నాణ్యత మరియు వేగం గురించి ఆయన నేరుగా బిల్డింగ్ కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. పనులు నిర్ణీత గడువులోగా, ఎలాంటి రాజీ లేకుండా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు తెలిపారు. అలాగే పాఠశాలలో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై ఫయాజ్ ఆరా తీశారు. భోజనం నాణ్యత, విద్యార్థులకు అందిస్తున్న వంటకాల వివరాలు, మరియు పరిశుభ్రత గురించి ఉపాధ్యాయురాలును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో అధికారులు మరియు ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ వహించాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థినులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని , వీటిని పర్యవేక్షించడం తమ కర్తవ్యమని ఎన్ఎండి ఫయాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ రవి, ఈశ్వర్, దీపక్ రెడ్డి, అలీ, బషీర్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల అభివృద్ధి పనులను సందర్శించిన ఎన్ఎండి ఫయాజ్