అఫ్జల్ గంజ్ , హైదరాబాద్ : (పున్నమి ప్రతినిధి):
ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో జేసీఐ ఇండియా సంస్థ నుండి జేసీఐ సికింద్రాబాద్ వాళ్ల ఆధ్వర్యంలో ఎన్పవర్ యూత్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీఐ హైదరాబాద్ చాంపియన్స్ సెక్రటరీ ప్రేమ్ చంద్ పులిగిల్ల గారు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు, లీడర్షిప్ స్కిల్స్, ఇతర నైపుణ్యాలు కూడా అలవర్చుకుంటే భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు సాధించగలరని తెలిపారు.
మంగళవారం ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాలలో నిర్వహించిన ‘ఎంపవర్ యూత్ శిక్షణ – 2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభలను వెలికితీసి, ఉపాధి అవకాశాలకు దారి చూపుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమం జేసీఐ సికింద్రాబాద్ ప్రెసిడెంట్ జెసి రవళి సోమా గారు ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీఐ హైదరాబాద్ నవ అధ్యక్షుడు జెసి శ్రీధరస్వామి , కో ట్రైనర్స్ జెసి మహేష్ కుమార్ గారు, జెసి రాజు గౌడ్ గారు, కోఆర్డినేటర్ జెసి ప్రతీక్ గారు, స్కూల్ ప్రిన్సిపాల్ గారు, యాజమాన్యం ,తదితరులు పాల్గొన్నారు.

