Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Jayashankar Bhupalpally

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను మారుస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

Punnami Newsroom Published: Updated:

Story highlights

  • ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను మారుస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు మహాదేవ్ పూర్, జులై 14, పున్నమి ప్రతినిధి: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల…
  • సోమవారం మహదేవ్ పూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గివ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సౌజన్యంతో పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను మారుస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

మహాదేవ్ పూర్, జులై 14, పున్నమి ప్రతినిధి: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

సోమవారం మహదేవ్ పూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గివ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సౌజన్యంతో పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మొదటగా పాఠశాల ఆవరణలో అటవీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం 650 మంది విద్యార్థిని, విద్యార్థులకు పాఠశాల షూస్, స్పోర్ట్స్ షూస్ లను పంపిణీ చేశారు. ఖేల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తుందని తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ కు ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామీణ స్థాయి నుండి పాఠశాలలను బలోపేతం చేసేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించారని, ప్రతి నియోజకవర్గానికి మోడల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెస్ లను నిర్మిస్తున్నారని, టీచర్ల కొరత లేకుండా నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ లు , పుస్తకాలు అందిస్తూ నూతన డైట్ మెనూ ను తీసుకు వచ్చి నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పాఠశాలకు డ్యూయల్ డెస్క్ లను పంపిణీ చేశామని తెలిపారు.
మహదేవ్ పూర్ ప్రభుత్వ పాఠశాలకు మంచి చరిత్ర కలిగి ఉందని ఈ పాఠశాల ఒక పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకుని సి.ఎస్.ఆర్ నిధులు సుమారు 15 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. మహదేవ్ పూర్ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి మెరుగైన విద్యను అందిస్తున్నారని అభినందించారు. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాల నుండి సుమారు 245 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం గొప్ప విషయం అని హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గమనించాలని రాబోయే రోజుల్లో గొప్ప స్థాయిలో ఎదిగి ప్రభుత్వానికి, గ్రామానికి తల్లి దండ్రులకు మంచి పేరు తేవాలని మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చాలా చురుకుగా విద్యను అభ్యసిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యార్థుల సౌకర్యార్ధం అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అంతేకాకుండా బాలికల కోసం మొట్టమొదటి సారిగా మహాదేవ్ పూర్ పాఠశాలలో సానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్,అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ,విద్యాశాఖ అధికారి రాజేందర్, గివ్ ఫౌండేషన్ ప్రతినిధులు అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *