Sunday, 12 April 2026
  • Home  
  • ప్రభుత్వ పాఠశాలలకు సి.హెచ్.ఎస్ సేవలు అభినందనీయం – ఎంఈఓ ఖాజా మొహిదీన్
- అన్నమయ్య

ప్రభుత్వ పాఠశాలలకు సి.హెచ్.ఎస్ సేవలు అభినందనీయం – ఎంఈఓ ఖాజా మొహిదీన్

చిట్వేల్: గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చల్లటి త్రాగునీటి వసతి కల్పించేందుకు ముందడుగు వేసిన చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ (సి.హెచ్.ఎస్) స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులను చిట్వేల్ మండల విద్యాశాఖ అధికారి ఖాజా మొహిదీన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిట్వేల్‌లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తున్నానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి లక్ష్యంగా స్థానిక యువత కలిసి సి.హెచ్.ఎస్ సంస్థను స్థాపించి చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాఠశాలల్లో చల్లటి మంచినీటి యంత్రాల ఏర్పాటు, పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, విశేష దినాల్లో విద్యా సామగ్రి పంపిణీ, క్రీడా మైదానాల పునరుద్ధరణ, స్పోర్ట్స్ కిట్‌ల పంపిణీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చదువు మరియు క్రీడల పరంగా ఆర్థిక సహాయం, మారుమూల గ్రామాల్లో నూతన పాఠశాల భవనాల నిర్మాణానికి సహకారం వంటి సేవలు అభినందనీయమని తెలిపారు. ఇలాంటి సేవా సంస్థలు సమాజానికి ఆదర్శమని, సంస్థ సభ్యులు మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి మా లక్ష్యం – గాడి ఇంతియాజ్ అహ్మద్, కార్యదర్శి ఈ సందర్భంగా సి.హెచ్.ఎస్ సేవా సంస్థ కార్యదర్శి గాడి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, వేసవికాలంలో ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులకు చల్లటి త్రాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.ఒక్కో పాఠశాలకు లక్ష రూపాయల చొప్పున వెచ్చించి ఇప్పటివరకు వెంకటరాజుపల్లి, నగిరిపాడు, మార్గోపల్లి, తిమ్మాయపాలెం, కెఎస్ అగ్రహారం తదితర గ్రామాల పాఠశాలల్లో మంచినీటి యంత్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల వారు కూడా సి.హెచ్.ఎస్ సభ్యత్వం తీసుకుని ముందుకు వస్తే, ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చల్లటి త్రాగునీటి యంత్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. సంస్థ తరఫున 80 శాతం ఆర్థిక సహాయం అందిస్తామని, మిగిలిన 20 శాతం స్థానికులు భరించాలని సూచించారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఖాజా మొహిదీన్, ఉపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్, సి ఆర్ పి చంద్ర, సి.హెచ్.ఎస్ ప్రతినిధులు గాల శివారెడ్డి, గాడి ఇంతియాజ్ అహ్మద్, అహ్మద్, ఎంవి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిట్వేల్: గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చల్లటి త్రాగునీటి వసతి కల్పించేందుకు ముందడుగు వేసిన చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ (సి.హెచ్.ఎస్) స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులను చిట్వేల్ మండల విద్యాశాఖ అధికారి ఖాజా మొహిదీన్ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిట్వేల్‌లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తున్నానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి లక్ష్యంగా స్థానిక యువత కలిసి సి.హెచ్.ఎస్ సంస్థను స్థాపించి చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
పాఠశాలల్లో చల్లటి మంచినీటి యంత్రాల ఏర్పాటు, పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, విశేష దినాల్లో విద్యా సామగ్రి పంపిణీ, క్రీడా మైదానాల పునరుద్ధరణ, స్పోర్ట్స్ కిట్‌ల పంపిణీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చదువు మరియు క్రీడల పరంగా ఆర్థిక సహాయం, మారుమూల గ్రామాల్లో నూతన పాఠశాల భవనాల నిర్మాణానికి సహకారం వంటి సేవలు అభినందనీయమని తెలిపారు. ఇలాంటి సేవా సంస్థలు సమాజానికి ఆదర్శమని, సంస్థ సభ్యులు మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి మా లక్ష్యం
– గాడి ఇంతియాజ్ అహ్మద్, కార్యదర్శి
ఈ సందర్భంగా సి.హెచ్.ఎస్ సేవా సంస్థ కార్యదర్శి గాడి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, వేసవికాలంలో ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులకు చల్లటి త్రాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.ఒక్కో పాఠశాలకు లక్ష రూపాయల చొప్పున వెచ్చించి ఇప్పటివరకు వెంకటరాజుపల్లి, నగిరిపాడు, మార్గోపల్లి, తిమ్మాయపాలెం, కెఎస్ అగ్రహారం తదితర గ్రామాల పాఠశాలల్లో మంచినీటి యంత్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల వారు కూడా సి.హెచ్.ఎస్ సభ్యత్వం తీసుకుని ముందుకు వస్తే, ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చల్లటి త్రాగునీటి యంత్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.
సంస్థ తరఫున 80 శాతం ఆర్థిక సహాయం అందిస్తామని, మిగిలిన 20 శాతం స్థానికులు భరించాలని సూచించారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఖాజా మొహిదీన్, ఉపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్, సి ఆర్ పి చంద్ర, సి.హెచ్.ఎస్ ప్రతినిధులు గాల శివారెడ్డి, గాడి ఇంతియాజ్ అహ్మద్, అహ్మద్, ఎంవి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.