Friday, 27 March 2026
  • Home  
  • ప్రభుత్వ ఆదేశాల అమలుపై విద్యాశాఖాధికారుల దిశానిర్దేశం
- ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆదేశాల అమలుపై విద్యాశాఖాధికారుల దిశానిర్దేశం

నరసన్నపేట మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో మండల విద్యాశాఖాధికారులు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు ఆధ్వర్యంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో 22-09-2025 (సోమవారం)న సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, దసరా సెలవులలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా డ్రాప్ అవుట్ డేటా, ఆపార్ పెండింగ్ డేటాను తక్షణమే ఆన్లైన్‌లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ప్రగతికి చదువుతో పాటు లౌకిక జ్ఞానం అందించే విధంగా, సామాజిక స్పృహ పెంపొందించే కార్యక్రమాలను పాఠశాలలో రూపకల్పన చేయాలని సూచించారు.

నరసన్నపేట మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో మండల విద్యాశాఖాధికారులు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు ఆధ్వర్యంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో 22-09-2025 (సోమవారం)న సమీక్షా సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, దసరా సెలవులలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అదేవిధంగా డ్రాప్ అవుట్ డేటా, ఆపార్ పెండింగ్ డేటాను తక్షణమే ఆన్లైన్‌లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ప్రగతికి చదువుతో పాటు లౌకిక జ్ఞానం అందించే విధంగా, సామాజిక స్పృహ పెంపొందించే కార్యక్రమాలను పాఠశాలలో రూపకల్పన చేయాలని సూచించారు.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.