*ప్రభుత్వం సూచించిన విధముగా విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం పెట్టాలి*
*మునిసిపల్ కమిషనర్ శ్రీ CH సైదులు గారు*
గద్వాల్ నవంబర్ 14(పున్నమి ప్రతినిధి)
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలోని ఉత్తనూరు రోడ్ నందు గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు నేడు మధ్యాహ్న భోజనంను *మునిసిపల్ కమిషనర్ శ్రీ CH సైదులు గారు* పరిశీలించారు
ఈ సందర్భంగా కమిషనర్ గారు పాఠశాల ప్రిన్సిపాల్ SO శ్రీమతి చెన్న బసమ్మ గారిని మధ్యాహ్న భోజనం గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. తదుపరి కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం అందించాలని మెనూ ప్రకారం ఏ పూటకు అందించాల్సిన భోజనమును ఆ పూటకు అందించాలని, పోషకాహార లోపం వల్ల ఎవరు ఇబ్బంది పడరాదని ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
*కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు, మునిసిపల్ వార్డ్ ఆఫీసర్ శ్రీ నారాయణ గారు తదితరులు పాల్గొన్నారు*


