నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శారదా విద్యాపీఠం పాఠశాలలో ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, పాఠశాల కమిటీ అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.
డాక్టర్ రవి కృష్ణ ,డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని యుద్ధాల బారి నుండి తప్పించి, శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించిందని, వివిధ విభాగాల ద్వారా ప్రపంచ ప్రజల సమగ్ర అభివృద్ధికి,ఆరోగ్య రక్షణకు,బాలల సంరక్షణకు,మానవ హక్కుల పరిరక్షణకు,దేశాల మధ్య సమన్వయం కోసం ఐక్యరాజ్యసమితి చేసిన కృషి విశిష్టమైనదన్నారు.
ఈ సందర్భంగా “ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి కృషి” అన్న అంశంపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వపు పోటీల విజేతలకు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు కశెట్టి చంద్రశేఖర్ సౌజన్యంతో బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు,నంద్యాల లయన్స్ క్లబ్ కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట కృష్ణయ్య, పాఠశాల కమిటీ ప్రతినిధులు చెన్నకేశవులు, వసుంధర, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు:
వ్యాసరచన పోటీలో మీనాక్షి,చందు,జగదీష్ వరసగా ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు సాధించగా,గౌరీ, మహమ్మద్ స్పెషల్ జ్యూరీ బహుమతులు అందుకున్నారు.
వక్తృత్వపు పోటీలో తరుణ్,శశాంక్,అష్రఫ్ వరుసగా ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించగా, స్పెషల్ జూరి బహుమతులు అఫాన్, మానస అందుకున్నారు.

ప్రపంచ శాంతి స్థాపనలో ఐక్యరాజ్యసమితి కృషి విశిష్టమైనది: డాక్టర్ రవి కృష్ణ.
నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శారదా విద్యాపీఠం పాఠశాలలో ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, పాఠశాల కమిటీ అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. డాక్టర్ రవి కృష్ణ ,డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని యుద్ధాల బారి నుండి తప్పించి, శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించిందని, వివిధ విభాగాల ద్వారా ప్రపంచ ప్రజల సమగ్ర అభివృద్ధికి,ఆరోగ్య రక్షణకు,బాలల సంరక్షణకు,మానవ హక్కుల పరిరక్షణకు,దేశాల మధ్య సమన్వయం కోసం ఐక్యరాజ్యసమితి చేసిన కృషి విశిష్టమైనదన్నారు. ఈ సందర్భంగా “ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి కృషి” అన్న అంశంపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వపు పోటీల విజేతలకు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు కశెట్టి చంద్రశేఖర్ సౌజన్యంతో బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు,నంద్యాల లయన్స్ క్లబ్ కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట కృష్ణయ్య, పాఠశాల కమిటీ ప్రతినిధులు చెన్నకేశవులు, వసుంధర, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. విజేతల వివరాలు: వ్యాసరచన పోటీలో మీనాక్షి,చందు,జగదీష్ వరసగా ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు సాధించగా,గౌరీ, మహమ్మద్ స్పెషల్ జ్యూరీ బహుమతులు అందుకున్నారు. వక్తృత్వపు పోటీలో తరుణ్,శశాంక్,అష్రఫ్ వరుసగా ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించగా, స్పెషల్ జూరి బహుమతులు అఫాన్, మానస అందుకున్నారు.

