జూలై 5 నుండి జూలై 28, 2025 వరకు జార్జియాలోని బటుమిలోని గ్రాండ్ బెల్లాజియో హోటల్‌లో జరిగిన FIDE మహిళల చదరంగ ప్రపంచకప్ ను మన భారత్ లోని నాగపూర్ కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశముఖ్ గె లుచుకొని, భారత దేశం నుంచి మొట్టమొదటి ప్రపంచ మహిళా చదరంగ ఛాంపియన్ గా చరిత్ర సృష్టించారు.
కాగా, ఈ పోటీలలో 46 దేశాలకు చెందిన 107 మంది పాల్గొన్నారు, ప్రపంచంలోని టాప్ 20 మహిళా క్రీడాకారులలో 17 మంది పాల్గొనడం విశేషం.
ప్రతి రౌండ్‌లో రెండు క్లాసికల్ గేమ్‌లు జరిగాయి – అవసరమైన సందర్భాలలో టైబ్రేక్‌లు నిర్వహించబడ్డాయి.
మొత్తం బహుమతి నిధి US$691,250 కాగా, ఛాంపియన్‌కు US$50,000, రన్నరప్‌కు $35,000 మరియు మూడవ స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి $25,000 ఇవ్వబడ్డాయి.
అలాగే, మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారు 2026 ఉమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు.
సెమీఫైనల్స్ లో
* **కోనేరూ హంపీ (భారతదేశం)** vs **లెయ్ టింగ్జీ (చైనా) మధ్య జరిగిన పోరులో, హంపీ టైబ్రేక్‌లో విజయం సాధించి ఫైనల్‌కి చేరగా,
**దివ్య దేశ్‌ముఖ్ (భారతదేశం)** vs **తాన్ జోంగియి (చైనా) మధ్య జరిగిన టైబ్రేక్‌లో దివ్య విజయం సాధించి తన మొదటి ప్రపంచ ఫైనల్‌కి చేరింది.
మూడవ స్థానం కోసం జరిగిన పోరులో
తాన్ జోంగియి,లెయ్ టింగ్జీని ఓడించి మూడవ స్థానం దక్కించుకుంది.
*ఫైనల్ కు చేరిన కోనేరూ హంపి మరియు దివ్య దేశ్‌ముఖ్* ఇద్దరూ మన భారత్ కు చెందినవారే కావడం గర్వకారణం.
వీరి మధ్య జరిగిన మొదటి రెండు క్లాసికల్ గేమ్స్ కూడా డ్రాగా ముగియటంతో టై బ్రేక్ ల ద్వారా విజేత ను నిర్ణయించాల్సి వచ్చింది.
టైబ్రేక్‌లలో దివ్య అసాధారణంగా ఆడి, రెండవ గేమ్‌లో విజయంతో *1.5–0.5 పాయింట్ల తేడాతో ఫైనల్ లో గెలవడం ద్వారా మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచి, భారత్ నుంచి మొట్టమొదటి ప్రపంచ మహిళా చెస్ ఛాంపియన్ గా చరిత్ర సృష్టించింది*.
ఈ విజయాన్ని అందుకోవడం ద్వారా దివ్య దేశముఖ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా గెలవడం మరో విశేషం.


