రౌతులపూడి, (పున్నమి )డిసెంబర్ 03 :
ప్రపంచ దివ్యంగుల దినోత్సవ సందర్భంగా రౌతులపూడి భవిత సెంటర్లో విద్యార్థులకు ఆటల పోటీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటిమండ్ల రాజలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం భవిత సెంటర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీపీ గంటి మల్ల రాజలక్ష్మి చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇట్టంశెట్టి సూర్య భాస్కర బాబు, వాసిరెడ్డి భాస్కర బాబు, మండల విద్యాశాఖ 2 అధికారి గాడి కొండబాబు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ మరియు భవిత సెంటర్ విద్యార్థులు పాల్గొన్నారు.


