పున్నమి ప్రతినిధి
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు లో జనవరి 3-5 వరకు జరిగే 3 వ ప్రపంచ తెలుగు సభలకు నెల్లూరు నుంచి
అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆహ్వానం అందుకున్నారు. మొదటి రోజు మధ్యాహ్నం 12.00 నుండి 1.00 వరకు జరిగే అనువాద సాహిత్య సదస్సుకు సభాధ్యక్షులుగా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి, గౌరవ అతిథి గా వంశీ రామరాజు
వక్తలుగా వెన్నా వల్లభరావు, అంబికా అనంత్, డా తుర్లపాటి రాజేశ్వరి, కొంపెల్ల బాల సుబ్రమణ్యం శర్మ అనువాద సాహిత్య వివిధ అంశాలపై ప్రసంగిస్తారు . ఈ సందర్భంగా డాక్టర్ పెరుగు రామకృష్ణను సారస్వత సేవా పురస్కారం కు
ఆంధ్ర సారస్వత పరిషత్ ఎంపిక చేశారు..!



