எங்களை தொடர்புகொள்ள சமீபத்திய செய்திகள்
உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
காக்கிநாடா

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో మానవహారం

புன்னமி செய்தியறை வெளியீடு: புதுப்பிப்பு:
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో మానవహారం

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • పున్నమి న్యూస్, పెద్దపురం, 01, డిసెంబర్.
  • పెద్దాపురంలోని వైస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా HIV అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.
  • ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా స్థానిక పెద్దాపురం ఆర్టీవో శ్రీమతి కే రమణి పాల్గొన్నారు, ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పెద్దాపురం మరియు కాకినాడ జిల్లా ఏయిడ్స్ రహిత ప్రాంతాలుగా ఉండాలని వివరించడం జరిగింది.

పున్నమి న్యూస్, పెద్దపురం, 01, డిసెంబర్. పెద్దాపురంలోని వైస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా HIV అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా స్థానిక పెద్దాపురం ఆర్టీవో శ్రీమతి కే రమణి పాల్గొన్నారు, ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పెద్దాపురం మరియు కాకినాడ జిల్లా ఏయిడ్స్ రహిత ప్రాంతాలుగా ఉండాలని వివరించడం జరిగింది. తర్వాత స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ హెచ్ఐవి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరు హెచ్ఐవి పరీక్ష చేయించుకుని వారి యొక్క స్థితిని తెలుసుకోవాలన్నారు, ఏయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపరాదని చెప్పడం జరిగింది. అనంతరం RDO గారు జండా ను ఊపి ర్యాలీ ణి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆర్డీవో ఆఫీసు నుండి స్థానిక మున్సిపల్ సెంటర్ వరకు కొనసాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రతి ఒక్కరుతో హెచ్ఐవి పట్ల అవగాహన కలిగేలా స్థానిక ఎస్సై మౌనిక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఐ సి టి సి కౌన్సిలర్ దిలీప్ శ్రీనివాస్, ఆశా వర్కర్లు, స్థానిక సిబ్బంది, మానహ హక్కుల సంఘం ప్రెసిడెంట్ N అప్పలకొండ వారి సిబ్బంది వైస్ సంస్థ ప్రెసిడెంట్ బి మల్లేశ్వరి, PD R జయ, PM M లక్ష్మణచార్యులు, V జార్జ్, లూధరన్ హై స్కూల్ విద్యార్థులు, సిబ్బంది, సాగర్ కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *