నంద్యాల ఈ నెల 16వ తేదీన కర్నూల్ జిల్లా, నన్నూరు టోల్ ప్లాజా దగ్గర గల రాగ మయూరి వెంచర్ల వద్ద జరిగే భారత ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి ఫరూక్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా ప్రమాణాలు, జన సమీకరణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై మంత్రి ఫరూక్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో పత్తిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు, శాప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు ఆలం నర్సం నాయుడుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని అధికారులతో మంత్రి ఎన్.ఎండి ఫరూక్ సమీక్ష