Monday, 8 December 2025
  • Home  
  • ప్రదాని వాల్మీకుల ST పునరుద్దరణపై 16వ తేదీన స్పష్టమైన ప్రకటన చెయ్యాలని ఎంవిఆర్పీఎస్ డిమాండ్
- Blog

ప్రదాని వాల్మీకుల ST పునరుద్దరణపై 16వ తేదీన స్పష్టమైన ప్రకటన చెయ్యాలని ఎంవిఆర్పీఎస్ డిమాండ్

మనదేశ ప్రదాని నరేంద్రమోడీ వాల్మీకుల చిరకాల కోరిక ST పునరుద్ధరణ కార్యాచరణ పై స్పష్టమైన ప్రకటన చెయ్యాలని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు,రాష్ట్రన్యాయ సలహాదారులు లాయర్ బోయ సుబ్బారాయుడు లు డిమాండ్ చేశారు సోమవారం నంద్యాలలో ముఖ్యనేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 2017 లో అసెంబ్లీలో వాల్మీకులను ST లుగా పునరుద్ధరించేందుకు అన్ని విధాలుగా అర్హులు అని తీర్మానం చేసి కేంద్రానికి పంపితే 2018 లోనే రెండు పర్యాయాలు కేంద్రప్రభుత్వ అనుబంధ సంస్థలైన RGI, SC, ST కమీషన్లు సవరణల పేరుతో వెనక్కు పంపటం జరిగింది,2019 తరువాత ప్రభుత్వం మారటం,మళ్ళీ 2023లో అసెంబ్లీలో తీర్మానం చేసినా ఎక్కడి గొంగళి అక్కడే ఉండిపోయింది,అయితే 2019 లో కర్నూల్ వచ్చిన ప్రధాని వాల్మీకుల గురించి మాట్లాడుతూ ఎప్పటినుండో మీరు ఇబ్బంది పడుతున్నారు,మీ సమస్య ,మీ బాధలు మాకుతెలుసు నన్ను నమ్మండి మీకు న్యాయం చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినా స్పందన లేదని,ఈ నెల 16న ఉమ్మడి కర్నూల్ జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని వాల్మీకుల ST పునరుద్దరణపై కార్యాచరణ చేపట్టి పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చేస్తానని స్పష్టమైన ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారుగౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో తీర్మానం విషయం,రాష్ట్రంలో 6 దశబ్దాలుగా వాల్మీకులు చేస్తున్న ఉద్యమాలు వారు నష్టపోయిన మేము ఆర్థిక,సామాజిక,రాజకీయంగా నష్టపోయిన విధానం,రాష్ట్రంలో ప్రాంతీయ విభేదం,పక్కరాష్ట్రం కర్ణాటకలో వాల్మీకులు ST లుగా ఉన్నవిషయాలు కూలంకుసంగా వివరించి వారిని మెప్పించి పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చూడాలని విజ్ఞప్తి చేసారు ఈ సమావేశంలో ఎంవిఆర్పీఎస్ జిల్లా యూత్ ఉపాధ్యక్షులు పరమేష్,సహాయ కార్యదర్శి మల్లికార్జున మండల నాయకులు బాలహుసేన్ ,బొగ్గులై ఎంవిఆర్పీఎస్ నేతలు టైలర్ శేఖర్,కేశవ, పట్టణ నాయకులు RMP మధు,యూత్ నాయకులు నిఖిల్,NGOS కాలనీ ఎంవిఆర్పీఎస్ నాయకులు రాంపుల్లయ్య,రమణ,మనోజ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.