Tuesday, 24 March 2026
  • Home  
  • సేవతో వేడుక – పొట్నూరు గిరీష్ పుట్టినరోజు ప్రత్యేకం పుట్టినరోజు = సేవా దినం
- ఆంధ్రప్రదేశ్

సేవతో వేడుక – పొట్నూరు గిరీష్ పుట్టినరోజు ప్రత్యేకం పుట్టినరోజు = సేవా దినం

సాధారణంగా పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసి, కొవ్వొత్తులు ఆర్పి, పూలతో శుభాకాంక్షలు అందుకోవడమే. కానీ తెలుగు కవిరత్న పొట్నూరు గిరీష్ గారి ఆలోచన మాత్రం భిన్నం. ఆయనకు పుట్టినరోజు అంటే సేవకు సంకేతం, మానవత్వానికి ముద్ర, రక్తపు చుక్కతో ప్రాణపు దీపం వెలిగించడం.రక్తదానం – ప్రాణదానం 13 సెప్టెంబర్ 2025న గిరీష్ గారి జన్మదినం. ఈ రోజును ఆయన వ్యక్తిగత ఆనందంగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే మహోత్సవంగా మలిచారు.“జన్మదినం అనేది ఒక్కరి పుట్టుకకే కాదు, మరొకరి ప్రాణానికి పునర్జన్మ ఇవ్వగల రోజు” అనే నమ్మకంతో ముందుకొచ్చారు. గిరీష్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ మోక్ష బ్లడ్ బ్యాంక్ సహకారంతో, 14 సెప్టెంబర్ 2025 (ఆదివారం), నరసన్నపేట శర్వాణి విద్యాలయం వేదికగా మెగా రక్తదాన శిబిరాన్ని స్వయంగా పొట్నూరు గిరీష్ గారు నిర్వహించారు.ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమంలో ఇరవైకి పైగా రక్తదాతలు పాల్గొని తమ సేవా భావాన్ని చాటుకున్నారు. గిరీష్ గారి మాటల్లో“రక్తదానం – రక్తస్నానం కాదు, రక్షణ. మన శరీరంలో తిరిగి పునరుత్పత్తి అయ్యే రక్తపు చుక్కలతో మరొకరి ప్రాణం నిలబెట్టడం కన్నా గొప్ప దానం లేదు. పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం వల్ల నా ఆనందం మరింత రెట్టింపైంది” అని గిరీష్ గారు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతమైన శుభ సందర్భంగా మోక్ష బ్లడ్ బ్యాంక్ వారు గిరీష్ గారిని దుశ్శాలువతో సన్మానించారు 🌹 కవితా స్పర్శ 🌹 జన్మదినం జ్ఞాపకం కాదు,జన్మదానం కావాలి,రక్తపు చుక్క రేపటి ఆశను వెలిగించాలి.

సాధారణంగా పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసి, కొవ్వొత్తులు ఆర్పి, పూలతో శుభాకాంక్షలు అందుకోవడమే. కానీ తెలుగు కవిరత్న పొట్నూరు గిరీష్ గారి ఆలోచన మాత్రం భిన్నం. ఆయనకు పుట్టినరోజు అంటే సేవకు సంకేతం, మానవత్వానికి ముద్ర, రక్తపు చుక్కతో ప్రాణపు దీపం వెలిగించడం.రక్తదానం – ప్రాణదానం 13 సెప్టెంబర్ 2025న గిరీష్ గారి జన్మదినం. ఈ రోజును ఆయన వ్యక్తిగత ఆనందంగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే మహోత్సవంగా మలిచారు.“జన్మదినం అనేది ఒక్కరి పుట్టుకకే కాదు, మరొకరి ప్రాణానికి పునర్జన్మ ఇవ్వగల రోజు” అనే నమ్మకంతో ముందుకొచ్చారు. గిరీష్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ మోక్ష బ్లడ్ బ్యాంక్ సహకారంతో, 14 సెప్టెంబర్ 2025 (ఆదివారం), నరసన్నపేట శర్వాణి విద్యాలయం వేదికగా మెగా రక్తదాన శిబిరాన్ని స్వయంగా పొట్నూరు గిరీష్ గారు నిర్వహించారు.ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమంలో ఇరవైకి పైగా రక్తదాతలు పాల్గొని తమ సేవా భావాన్ని చాటుకున్నారు. గిరీష్ గారి మాటల్లో“రక్తదానం – రక్తస్నానం కాదు, రక్షణ. మన శరీరంలో తిరిగి పునరుత్పత్తి అయ్యే రక్తపు చుక్కలతో మరొకరి ప్రాణం నిలబెట్టడం కన్నా గొప్ప దానం లేదు. పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం వల్ల నా ఆనందం మరింత రెట్టింపైంది” అని గిరీష్ గారు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతమైన శుభ సందర్భంగా మోక్ష బ్లడ్ బ్యాంక్ వారు గిరీష్ గారిని దుశ్శాలువతో సన్మానించారు

🌹 కవితా స్పర్శ 🌹

జన్మదినం జ్ఞాపకం కాదు,జన్మదానం కావాలి,రక్తపు చుక్క రేపటి ఆశను వెలిగించాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.