*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం*
*తేదీ: 22.10.2025*
*రైతుల పంటలకు సాగు నీరు అందించేందుకు ప్రతినిత్యం తాపత్రయపడుతున్నాను…..*
*అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా రెండు పంటలకు సాగు నీరు…..*
*2ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి 1400కోట్లు మంజూరు….*
*ఒక్క ఏడాదిలో అభివృద్ధి పనులు ప్రజల కళ్ల ముందు ఉంటాయి…..*
*ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక అభివృద్ధి నిధులు మంజూరు…..*
*అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి…..*
*రైతులు దళారుల వద్ద నష్టపోవద్దనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు…..*
*రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు….*
*ఈ సీజన్ నుండి మద్దతు ధరతో పాటే బోనస్ కూడా రైతుల ఖాతాలలో జమ….*
*కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి…..*
*రైతు పక్షపాతిగా ఉంటూ ప్రజా సంక్షేమానికి, మహిళా సంక్షేమనికి కృషి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తెలిపారు.*
రఘునాథపల్లి మండలం ఖిలాషపూర్, మంగలి బండ తండా, జాఫర్ గూడెం, వెల్ది గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక అభివృద్ధి నిధులను స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి తీసుకువచ్చానని తెలిపారు. గడిచిన 2ఏళ్లలోనే 1400కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఏడాదిలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల కళ్ళ ముందు ఉంచుతానని హామీ ఇచ్చారు. ఒక్క రఘునాథపల్లి మండలంలోనే ప్రతీ తండాకు పక్కా రోడ్డు ఉండాలని 30కోట్లతో అన్ని తండాలకు బిటీ రోడ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. నీడిగొండ, ఫతేషాపూర్, మాదారం మీదుగా ఖిలాషపూర్ వరకు 6కోట్లతో బిటీ రోడ్డు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి కాలువల వెంట, రిజర్వాయర్ల వెంట తిరుగుతూ అధికారులతో మాట్లాడుతూ కాలువలు తీయించడం, మారమ్మత్తు పనులు చేయించడం, సిసి లైనింగ్ చేయించడం వల్ల ఈ రోజు అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా రఘునాథపల్లి, లింగాల ఘనపూర్ మండలాలకు రెండు పంటలకు సాగు నీరు అందించగలుగుతున్నామని అన్నారు. యాసంగిలో కూడా పటేల్ గూడెం చెరువు నింపి రఘునాథపల్లి రైతులకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. ప్రజలందరూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్లినింగ్ మిషన్, మయిస్చర్ మిషన్, త్రాగు నీరు, విద్యుత్ లైట్లతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని నిర్వహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కల్లానికి వచ్చిన ధన్యంలో ఒక్క గింజ కూడా తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వహకులకు సూచించారు. మహిళలకు ఉపాధి కల్పించాలి మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతోనే మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని ఎవరైనా డబ్బులు అడిగితె తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారుల వద్దకు వెళ్లి నష్ట పోవద్దని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోతె మిల్లర్లు కనీసం 2వేలు కూడా పెట్టారని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనడం లేదని వెల్లడించారు. మొదటి గ్రేడ్ రకం ధాన్యానికి 2389రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి 2369 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. ఈ సీజన్లో రైతులకు మద్దతు ధరతో పాటే బోనస్ డబ్బులు కూడా రైతుల ఖాతాలలో వారం రోజుల లోపలనే జమ కానున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకొవాలని, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్మాలని కోరారు.
రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. 25 లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణ మాఫీ చేయడం, 9రోజుల్లో 9వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఒక చరిత్ర అని కొనియాడారు. సన్నాలకు 500రూపాయల బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ప్రభుత్వం నిలబడుతుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఆర్డివో, డిఆర్ డివో, తహసీల్దార్, ఎంపిడివో, ఏఈవో, డిపిఎం, ఎపిఎం, మహిళా సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


