బుధవారం VMRDA సమావేశమందిరంలో ముఖ్యమైన బృహత్తర ప్రణాళిక రహదారుల పనుల ప్రగతిని అధికారులతో,గుత్తేదారులు సమీక్షించిన VMRDA చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ ముఖ్యమంత్రి నాయుడు, మానవ వనరులశాఖ మంత్రి లోకేశ్ భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే రహదారులపై ప్రత్యేక దృష్టి సారించినందువలన ఎట్టి పరిస్థితుల్లో నిర్దేశించిన కాలపరిమితి లోగా పనులను పూర్తి చేసి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి తీసుకుని రావాలని చెప్పారు.అదేవిధంగా GVMC తో సమన్వయం చేసుకొంటూ TDR సత్వరం ఇవ్వవలసిన లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం క్లియర్ గా ఉన్న మేరకు పెగ్ మార్కింగ్ చేసి పనులు ముందుకు తీసుకొని వెళ్ళాలని సూచించారు. అటవీశాఖకు చెందిన భూములున్న రహదారి మార్గాల్లో అనుమతులు వేగంగా వచ్చే విధంగా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించాలని చెప్పారు.ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని,అదేసమయంలో నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనులను పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ రమేష్ ,కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, ఎస్టేట్ అధికారి దయానిధి, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్, మధుసూదన రావు, కార్యనిర్వహక ఇంజినీర్లు రామరాజు, రాంబాబు, సుధీర్, వరుణ్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.*

ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష