పున్నమి న్యూస్ (కోనసీమ), జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం మాగాం గ్రామం విశ్వనాథరాజు కాలనీ స్కూల్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా వీరవల్లిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ విజయ్ నేతృత్వంలో గ్రామ సర్పంచ్ కాశీ వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షతన స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సందర్శించారు. మొదటగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు, సేవా పక్వాడ జిల్లా కో కన్వీనర్ లు గనిశెట్టి వెంకటేశ్వరరావు, సలాది వీరబాబు పాల్గొని మాట్లాడుతూ ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటాదనే మోడీ ఉద్దేశంతో స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ పేరుతో ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించి మహిళలకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ వైద్య శిబిరాలు మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అంగనవాడి సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి వారు చేసిన పౌష్టికాహార పిండి వంటలు రుచి చూశారు. అనంతరం పేషెంట్ లకు బ్రెడ్ లు, రస్క్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ముద్రగడ నరసింహారావు(చంటి), ఎం.ఎల్.హెచ్.పీ టి.షారోన్, సేవా పక్వాడ్ మండల ఇంచార్జిలు మోకా ఆదిలక్ష్మి, మిద్దె రవి రాజ్, రాష్ట్ర నాయకులు కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి, యనమదల రాజ్యలక్ష్మి, మేకల వీర వెంకట సత్యనారాయణ, కూటమి నేతలు కొమ్మిరెడ్డి శివ, తాడినాటి రామకృష్ణ, అత్తిలి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


