చిట్వేల్, డిసెంబర్ 21 పున్నమి ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షుడు మల్లెం హేమంత్ కుమార్ పాల్గొని చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 6 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి బిడ్డకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని నిర్ణయించారు.పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలంటే పోలియో రహిత సమాజం అవసరమని, ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా తమ చుక్కల మందు వేయించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనలు కావాలని. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు శ్రావణి, రమాదేవి, గడిచినపాటి ప్రకాష్ మరియు ఇతర స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు.


