*ప్రతి పేదవానికి సొంత గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం*
*నగర మేయర్ పీలా శ్రీనివాసరావు*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
నగరంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత గూడు కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన పెందుర్తి జోన్ వేపగుంట లోని కళ్యాణ మండపంలో పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ పథకం కింద బెనిఫిసరీ లీడ్ కన్స్ట్రక్షన్ (బి. ఎల్. సి) పత్రాలను పంపిణీ కార్యక్రమం పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పలువురు కార్పొరేటర్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఇది పేదల సంక్షేమ ప్రభుత్వమని గూడు లేని ప్రతి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు గూడు కల్పించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. నీడ లేని పేదలకు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృషి చేస్తున్నాయని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని వారికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని మంత్రి ఆవయాస్ యోజన 2.0 అర్బన్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా 2 లక్షల 50 వేలు అందిస్తుందని, నేడు 77, 78, 93, 94, 95, 96, 97, 98 వార్డులలో 709 మంది అర్హులైన వారికి బెనిఫిసరీ లీడ్ కన్స్ట్రక్షన్ (బి. ఎల్. సి) పత్రాలను అందించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వాటా కింద 1లక్ష 50 వేలు, రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు సమకూర్తుంది అన్నారు.
అనంతరం పెందుర్తి శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం సంక్షేమం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పెందుర్తి నియోజకవర్గం లోని పలు వార్డులలో ఇండ్ల స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్తోమత లేని వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ పథకం ద్వారా
2 లక్షల 50 వేలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి, సంక్షేమం రెండు నిరంతరం కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని పేర్కొన్నారు నేడు 709 మందికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం జరిగినది అన్నారు.
ఈ కార్యక్రమంలో బల్ల శ్రీనివాసరావు, ముమ్మన దేముడు, రాపర్తి కన్నా, సేనాపతి వసంతలక్ష్మి, జోనల్ కమిషనర్ శంకర్, ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది, హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


