చిట్వేల్ జులై 21 ( పున్నమి న్యూస్)
*ముక్కా రూపానంద రెడ్డి మరియు అరవ శ్రీధర్ గారి నేతృత్వంలో రైల్వే కోడూరు లో కదం తొక్కుతున్న అభివృద్ధి..* .
*కోడూరు పట్టణం లోని లక్ష్మీనగర్ నందు ₹20 లక్షల వ్యయం తో భూగర్భ డ్రైనేజ్,సీసీ రోడ్డు ను ప్రారంభించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్
*ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ –* “ ప్రతి పట్టణం మరియు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే మా సంకల్పం. ప్రజల నమ్మకానికి మేం న్యాయం చేస్తాం. రైల్వే కోడూరు ప్రజలు 20 సంవత్సరాలుగా చూడని అభివృద్ధిని కూటమిపాలన ఈ ఒక్క సంవత్సరంలో సాధించింది. రాబోయే రోజులను మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రైల్వేకోడూరును అభివృద్ధి దిశగా నడిపిస్తాం,” అని అన్నారు.
*అరవ శ్రీధర్ మాట్లాడుతూ –* “రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తానికి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నాం. లక్ష్మీనగర్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడడం అభినందనీయం. సీఎం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతుంది,” అని తెలిపారు.
*ఈ కార్యక్రమంలో* కూటమినేతలు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.


