*: బహుజన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి*
*: అంబేడ్కర్ కల జగనన్న నిజం చేశారు*
*: జగనన్న అబద్దపు హామీలు ఇవ్వలేదు*
రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అందించారని, అయితే జగనన్న ప్రతి కుటుంబానికి ఇచ్చిన అస్తి చదువేనని, ఆ చదువులో ప్రతి కుటుంబం భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి వెళ్లి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
మంగళవారం బ్రాహ్మణపల్లిలోని మేకపాటి నివాసంలో బహుజనుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి కుటుంబంలో చిన్నారులు చదువుకునేందుకు వారి తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడిని అందించారని, అంతేకాక ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేశారని, దీంతో మన రాష్ట్రంలో చదువుకునే వారి శాతం పెరిగిందని అన్నారు.
గతంలో ఈ పరిస్థితి లేదని, తన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చదువుల కోసం ఎన్నో ఇబ్బందులు వడ్డారని, ఆయన బాగా చదువుకోవడంతో మా కుటుంబమంతా ఉన్నతికి చేరుకుందని, మండలంలో విద్యాభివృద్ధి కోసం కూడా కృషి చేశారని పేర్కొన్నారు. అదే విధంగా ప్రతి కుటుంబంలో ఒక్కరూ చదువుకుంటే కుటుంబం అభివృద్ధి చెందుతుందని జగనన్న భావించారని, అందుకోసం తన ఐదేళ్ల పాలనలో విద్యపైనే రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు.
జగనన్న మెనిఫెస్టో ప్రజలందరికి నమ్మకం ఉందని, మళ్లీ ఆయన ప్రకటించిన మెనిఫెస్టోపై ప్రజలంతా నమ్మకం కలిగి ఉన్నారని, సంక్షేమం రెండింతలు తప్పక అవుతుందన్నారు. గతంలో మెనిఫెస్టోలో రుణమాఫీ చేయాలని చాలా మంది చెప్పిన సందర్భంలో కూడా నేను చేయలని హామిని ప్రజలకు ఇవ్వలేనని, చెప్పిన ప్రతి హామిని నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని జగన్నన చెప్పారన్నారు.
ఇలా గతంలో ఆయన ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజల్లో మెనిఫెస్టోపై నమ్మకం తీసుకురావడంతోనే ఆయన పట్ల ప్రజలందరికి నమ్మకం ఏర్పడిందని అన్నారు. అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు నందా ఓబులేను సైతం ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకంతోనే మాకు మద్దతు తెలిపి మా వెంట నడిచేందుకు సిద్ధమయ్యారని వివరించారు.
మెనిఫెస్టోలో జగనన్న 50 శాతం దళితులు ఉండి, దళితుల జనాభా 500కు పైగా ఉన్న వాటిని ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఆయన హామి ఇస్తే తప్పక చేస్తారనే నమ్మకంతోనే నందా ఓబులేసు తదితరులు వైఎస్సార్సీపీ వెంట నడుస్తున్నారని పేర్కొన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులను కూడా భాగస్వాములను చేసుకోవాలని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి వధంలో నడిపిస్తామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.230 కోట్లు విలువ చేసే ఉదయగిరి ఇంజనీరింగ్ కళాశాలను దివంగత మంత్రి మా సోదరుడు గౌతమ్ రెడ్డి పేరున ప్రభుత్వానికి అంచచేయడం జరిగిందని, మా తండ్రి ఒకే మాట చెబుతారని, రాజకీయాల్లోకి వచ్చేది ప్రజా సేవ చేసేందుకేనని. ఆ విధంగా మేకపాటి కుటుంబం ముందుకు సాగుతుందని అన్నారు.
గతంలో అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ రానున్న రోజుల్లో చేయబోయే మంచిని చెబుతూ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేలా ప్రజలందరిని కోరాలనిని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో లాయర్ నందా ఓబులేసు,ఆత్మకూరు చిన్నపిల్లల డాక్టర్ ఆది శేషయ్య,ఎంపీపీ గంగ వరపు శ్రీనివాసులు నాయుడు వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు