ప్రతి ఒక్కరు సేవా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి
— డాక్టర్ కందుల నాగరాజు
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
ప్రతి ఒక్కరూ సేవాస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందులు నాగరాజు తెలిపారు. పుష్పవతి అయిన
34 వ వార్డులో నేతాజీ నగర్ ప్రాంతానికి చెందిన శరణ్య, రేణుకలకు డాక్టర్ కందుల నాగరాజు అలాగే, హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలకృష్ణ చేతుల మీదుగా వెండి పట్టీలు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ అందజేశారు.
అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సాటి వారికి సహాయం చేయాలని సంకల్పంతో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని కోరారు.
సమాజమే దేవాలయంగా భావించే తాను నిస్వార్ధంగా చేస్తున్న సేవలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని చెప్పారు. ఎప్పుడు ఎవరికీ ఏ అవసరం వచ్చినా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సహాయం చేస్తూ వస్తున్నానని తెలిపారు.
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే లక్ష్యంతో తాను ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
తాను ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా ఆలోచించి అదేవిధంగా తన ఆలోచనలు అమలు చేస్తానని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సతీష్, రామానాయుడు ,రాజు, కందుల కృష్ణ, శ్రీను , గౌరీ, నాగమణి ,కుమారి, కనకరత్నం, వెంకటేష్, జానకి, కుమారి తదితరులు పాల్గొన్నారు.


