ప్రతి ఆదివారం విశాఖలో ఆర్గానిక్ సంత
– ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఎయు నార్త్ క్యాంపస్ ఎం హబ్ లో
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
– దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, జిల్లా అధ్యక్షులు, గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం
విశాఖ నగరంలో నిర్వహించె ప్రకృతి ఆధారంగా నుండె పంటల సంతను జయప్రదం చేయండి అని గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఎ హబ్ వద్ద కలిసిన విలేఖరులతో మాట్లాడారు. 2వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఎ హబ్, మద్దిలపాలెం లో నిర్వహించబోయే విశాఖ ఆర్గానిక్ సంతను జయప్రదం చేయాలని కోరారు. ఎటువంటి హానికర కెమికల్స్ వాడకుండా పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలు,చెక్క గానుగ నూనెలు, బెల్లం, ఖాదీ, చేనేత వస్త్రాలు విక్రయించడం జరుగుతుంది అన్నారు. కంపోస్టింగ్, టెర్రస్ గార్డెన్, బయో ఫెర్టిలైజర్స్, హస్తకళలు మొదలైన వాటిపై వర్క్ షాప్లు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పాలేం నేచురల్స్ అశోక్ , గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు .

ప్రతి ఆదివారం విశాఖలో ఆర్గానిక్ సంత
ప్రతి ఆదివారం విశాఖలో ఆర్గానిక్ సంత – ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఎయు నార్త్ క్యాంపస్ ఎం హబ్ లో విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- – దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, జిల్లా అధ్యక్షులు, గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం విశాఖ నగరంలో నిర్వహించె ప్రకృతి ఆధారంగా నుండె పంటల సంతను జయప్రదం చేయండి అని గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఎ హబ్ వద్ద కలిసిన విలేఖరులతో మాట్లాడారు. 2వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఎ హబ్, మద్దిలపాలెం లో నిర్వహించబోయే విశాఖ ఆర్గానిక్ సంతను జయప్రదం చేయాలని కోరారు. ఎటువంటి హానికర కెమికల్స్ వాడకుండా పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలు,చెక్క గానుగ నూనెలు, బెల్లం, ఖాదీ, చేనేత వస్త్రాలు విక్రయించడం జరుగుతుంది అన్నారు. కంపోస్టింగ్, టెర్రస్ గార్డెన్, బయో ఫెర్టిలైజర్స్, హస్తకళలు మొదలైన వాటిపై వర్క్ షాప్లు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పాలేం నేచురల్స్ అశోక్ , గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు .

