Tuesday, 24 March 2026
  • Home  
  • ప్రణాళికతో ప్రయత్నిస్తేనే ఏదైనా సాధించగలుగుతారు
- నాగర్‌కర్నూల్

ప్రణాళికతో ప్రయత్నిస్తేనే ఏదైనా సాధించగలుగుతారు

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 19 విద్యార్థులు ప్రణాళికతో ప్రయత్నిస్తేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారని కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ దేవరకొండ ప్రభుత్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం బిజినపల్లి మండలం పాలెం లోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు కెరీర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాములు అద్యక్షతన జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ గా దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి అదే కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు జి లింగారెడ్డి,డాక్టర్ ఎం ప్రభాకర్ దీంతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ డాక్టర్ రమావత్ రవి విద్యార్థులకు వారి జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి కావాలసిన పలు సూచనలు అందించారు.విద్యార్థులు ముందు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటే దానికి తగ్గట్టు ప్రణాళికతో చదివితేనే భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడవచ్చు అని సూచించారు.తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుంటూ శ్రద్ధగా చదివితేనే ఫలితం లభిస్తుందని చెడు మార్గాలకు అలవాటు పడొద్దని ఈ సందర్భంగా తెలిపారు.మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటే ఆ విధంగానే అవుతామని కావున మనసులో మంచి ఆలోచనలు చేయాలని అన్నారు. విద్యార్థులు ఎప్పుడు కూడా నేనే టాప్ లో ఉండాలని కసితో చదవాలని అప్పుడే అనుకున్నది సాధించ గలుగుతారని వివరించారు.అనంతరం ఎస్ వి జి ఎ&ఎస్(ఎ)కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు అతిథులను శాలువాలతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ వర్కాల శ్రీనివాసులు,కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుష్మ, అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, శివ,ప్రవలిత, జూనియర్ అసిస్టెంట్ కురుమయ్య,విద్యార్థులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 19
విద్యార్థులు ప్రణాళికతో ప్రయత్నిస్తేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారని కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ దేవరకొండ ప్రభుత్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం బిజినపల్లి మండలం పాలెం లోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు కెరీర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాములు అద్యక్షతన జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ గా దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి అదే కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు జి లింగారెడ్డి,డాక్టర్ ఎం ప్రభాకర్ దీంతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ డాక్టర్ రమావత్ రవి విద్యార్థులకు వారి జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి కావాలసిన పలు సూచనలు అందించారు.విద్యార్థులు ముందు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటే దానికి తగ్గట్టు ప్రణాళికతో చదివితేనే భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడవచ్చు అని సూచించారు.తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుంటూ శ్రద్ధగా చదివితేనే ఫలితం లభిస్తుందని చెడు మార్గాలకు అలవాటు పడొద్దని ఈ సందర్భంగా తెలిపారు.మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటే ఆ విధంగానే అవుతామని కావున మనసులో మంచి ఆలోచనలు చేయాలని అన్నారు. విద్యార్థులు ఎప్పుడు కూడా నేనే టాప్ లో ఉండాలని కసితో చదవాలని అప్పుడే అనుకున్నది సాధించ గలుగుతారని వివరించారు.అనంతరం ఎస్ వి జి ఎ&ఎస్(ఎ)కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు అతిథులను శాలువాలతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ వర్కాల శ్రీనివాసులు,కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుష్మ, అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, శివ,ప్రవలిత, జూనియర్ అసిస్టెంట్ కురుమయ్య,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.