శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): పదవి అనేది కేవలం హోదా మాత్రమే కాదని, ప్రజలకు సేవకుడిగా అండగా నిలవడానికి దక్కిన ఒక గొప్ప అవకాశమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు పట్టణంలోని పీఆర్ గెస్ట్ హౌస్‌లో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS) కార్యక్రమంలో ఆయన పాల్గొని నియోజకవర్గ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపడమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విన్నపాలను ఆయన వ్యక్తిగతంగా పరిశీలించారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు ఇతర వ్యక్తిగత సమస్యలపై అందిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు బదిలీ చేస్తూ, వాటిని అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. “మీ సమస్య ఏదైనా, మీకు తోడుగా ఉండటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని ఎమ్మెల్యే ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ప్రజా సేవకుడిగా అండగా ఉంటా-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి