ప్రజా వైద్యం ప్రజల హక్కు..
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాలు.
ఒక ఉద్యమంలో సాగుతున్న కోటి సంతకాల ప్రజా అభిప్రాయ సేకరణ.
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి చేస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం, వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు రోడా కొండయ్య, దనాల రమణయ్య, ధనాల రామారావు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కుట్రలు పన్నుతో, నాడు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి హాయంలో పూర్తయిన ఏడు మెడికల్ కాలేజీలు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు వంటి నగరాల్లో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే వీలుగా మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు ప్రభుత్వ మంజూరు చేసి విద్యార్థుల సమస్యలను తీర్చిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఇంకా నాలుగు కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అవి ఆదోని, మార్కాపురం, మదనపల్లి,పిడుగురాళ్ల, అమలాపురం,బాపట్ల, నర్సీపట్నం,పార్వతీపురం,పాలకొల్లు,పెనుగొండ, పట్టణాల్లో మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు సన్నాహాలు చేసి ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మెడికల్ కాలేజీలు అన్నిటినీ ప్రైవేట్ పరం చేసేందుకు , ప్రభుత్వం అడుగులు వేస్తుందని అలా ప్రైవేట్ పరం చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువు అందని ద్రాక్షగా మిగిలిపోతుందని వైఎస్ఆర్సిపి నాయకులు అడ్డుకుంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదని అవి పూర్తిగా ప్రభుత్వం రంగంలోని నడపాలని వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో నాణ్యమైన విద్య వై�


