కామారెడ్డి , 07జనవరి, ( పున్నమి ప్రతినిధి )
ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు స్పష్టమైన ఆదేశాల మేరకు రామారెడ్డి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగిందని తెలిపా రు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ,అనారోగ్యంతో బాధపడుతు న్న పేదలకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబా లకు ఈ సహాయం తక్షణ ఆశ్రయంగా మారిందని చెప్పారు.ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టు బడి ఉంద ని,ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయక త్వంలో మరి న్ని కార్యక్రమాలు జరుగు తాయని చెప్పారు.గ్రామా ల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యవేక్షణ లో ఈ చెక్కు ల పంపిణీ పూర్తి చేశామన్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ప్రకారం వైద్య చికిత్స ఖర్చు లు,కుటుంబ ఆర్థిక స్థిరత్వం, అత్యవసర అవసరా ల కోసం ఈ సహాయం అందుబాటులోకి వచ్చింది. లబ్ధిదారులు తమ అనుభవాలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్ర మం మండల ప్రజలలో సంతోష రాగాలను రేకెత్తిం చింది లబ్ధిదారుల పూర్తి జాబితా చెక్కులు పంపిణీ చేసిన లబ్ధి దారుల వివరాలు ఇలా ఉన్నాయి. రామారెడ్డి, ఇసనపల్లి, పోసాని పేట్, మోశంపూర్, ఉప్పల్ వాయి,గ్రామాలకు చెందిన సుమారుగా 315,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 9 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశామన్నా రు. ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు తగ్గట్టుగా మొత్తాలు పొందారు.ఈ చెక్కులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో డిపాజి ట్ అయి వెంటనే వాడుకకు అందుబాటులోకి వస్తాయి.ఈ సహాయం తో తమ కుటుంబాల భవి ష్యత్తును రక్షించుకోగల రని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ల్యాగల ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి, పోసానిపేట్ గ్రామ ఉప సర్పంచ్ అంజయ్య, రామా రెడ్డి సర్పంచ్ ప్రవీణ్,ఇసన్నపల్లి సర్పంచ్ దోకి లచ్చ య్య కన్నాపూర్ సర్పంచ్ గొల్ల మహేష్ గొల్లపల్లి సర్పంచ్ కిషన్ యాదవ్, వార్డు సభ్యులు గ్రామస్తు లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


