గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
గంగవరం అదాని పోర్ట్ యాజమాన్యం. గతంలో పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన. గంగవరం మరియు దిబ్బపాలెం నిర్వాసిత కార్మికులను విచక్షణ రహితంగ తొలగించడమే కాకుండా. గుజరాత్ నుంచి కార్మికుల తెచ్చుకుని స్థానిక కార్మిక హక్కులను కాలరాస్తుంది. అదే కాకుండా ఈ ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్యం మాయం చేసి ప్రజల జీవితాలతో ఆటలాడుతుంది. అంతే కాకుండా ఇప్పుడు. పెదగంట్యాడ పరిసర ప్రాంతంలో *అంబుజా గ్రేడింగ్ సిమెంట్* ఏర్పాటు చేస్తానంటూ ప్రయత్నాలు చేయడం అత్యంత ఆక్షేపణయము.. ఇప్పటికే అధానిపోర్టు వలన కాలుష్య కోరల్లో చిక్కుకున్న గాజువాక ప్రాంతం ఈ గ్రేడింగ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తీవ్రమైన అనారోగ్యంతో పాటు ప్రజా జీవనానికి పెనుముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది.. గతంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపు లేకుండా గంగవరం పోర్ట్ లో సుమారు 7000 కోట్ల ప్రభుత్వ వాటాను 600 కోట్ల రూపాయలకే ప్రభుత్వ హక్కును అదానికి దారా దత్తం చేసి ప్రజల హక్కును కాల రాశాడు .. వైకాపా పాలకులు అనుసరించిన ద్వంద విధానాల వల్లనే ఆథాని పోర్ట్ యాజమాన్యం ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా అదాని యాజమాన్యం గాజువాక ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి బేషరతుగా అంబుజా గ్రేడింగ్ సిమెంట్ కంపెనీ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతున్నమని ఏపీఐఐసి డైరెక్టర్. తెలియజేశారు.


