ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్‌తో కలిసి ఆయన మొత్తం 232 అర్జీలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. భూమి మ్యుటేషన్, ఇందిరమ్మ ఇల్లు, రిజిస్ట్రేషన్ సమస్యలు, పింఛన్ మంజూరు వంటి అంశాలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని వేగంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.



