*గాజువాక లో ప్రజా పోరు… పోరాట యోధులుగా మారిన స్థానిక ప్రజలు*….
గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
ప్రజాభిప్రాయ సేకరణలో రాజకీయ పార్టీల నేతలు ఎక్కడ…
కొన్ని ప్రజాసంఘాలు తప్ప మిగిలిన అందరూ తూ తూ మంత్రంగానే మద్దతు….
కనీసమద్దతు కూడా తెలుపని అధికార, విపక్షాలు
రాజకీయాల పార్టీల అండ లేకపోయినా మరేం పరవాలేదు అంటూ , ఈ పోరాటంలో అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధం అంటున్న స్థానికులు…. ప్రజాభిప్రాయ సేకరణ లో గర్జించిన సామాన్యులు, ప్రజాభిప్రాయ సేకరణ సభకు అధిక సంఖ్యలో వచ్చిన26 గ్రామాల ప్రజలు,
ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ఆర్డిఓ నునిర్వాసితులు అడ్డుకున్నారు, ప్రజా వ్యతిరేకతతో అధికారులు వెనుతిరిగారు…
ఇక అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మానానికి వ్యతిరేకంగా పెద్దగా నినాదాలు చేసారు, కుర్చీలు విసిరేసి మరి *గో బ్యాక్ అంబుజా* అంటూ భారీగా నినాదాలతో ప్రజాగ్రహ జ్వాలలు చవి చూపరు…
దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసి వారిని అదుపు చేశారు…


