Monday, 30 March 2026
  • Home  
  • ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వింజమూరు మండలంలోని బుక్కాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ అధికారుల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (UDA) పథకం కింద మంజూరైన గృహా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, నూతనంగా నిర్మించబడిన గృహామును రిబ్బన్ కటింగ్ చేసి గృహప్రవేశోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ — కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకొస్తున్న నూతన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే పథకాల గురించి వివరిస్తూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా పేద మరియు అర్హులైన కుటుంబాలకు స్వంత గృహం కలిగే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.అలాగే తన నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరయ్యేలా తాను కృషి చేస్తానని, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు, పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వింజమూరు మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉదయగిరి హౌసింగ్ డిఈఈ సయ్యద్ పీరన్,దుత్తలూరు వర్క్ ఇన్స్పెక్టర్ S. పోలయ్య, వింజమూరు వర్క్ ఇన్స్పెక్టర్ K.సందీప్ రాజ్,డిపార్ట్మెంట్ అధికారులు డీఈవో. ప్రసాద్, బాలాజీ, ఆన్సర్, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొని, నూతన గృహాల నిర్మాణం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

వింజమూరు మండలంలోని బుక్కాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ అధికారుల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (UDA) పథకం కింద మంజూరైన గృహా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, నూతనంగా నిర్మించబడిన గృహామును రిబ్బన్ కటింగ్ చేసి గృహప్రవేశోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ — కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకొస్తున్న నూతన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే పథకాల గురించి వివరిస్తూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా పేద మరియు అర్హులైన కుటుంబాలకు స్వంత గృహం కలిగే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.అలాగే తన నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరయ్యేలా తాను కృషి చేస్తానని, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు, పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పని చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వింజమూరు మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉదయగిరి హౌసింగ్ డిఈఈ సయ్యద్ పీరన్,దుత్తలూరు వర్క్ ఇన్స్పెక్టర్ S. పోలయ్య, వింజమూరు వర్క్ ఇన్స్పెక్టర్ K.సందీప్ రాజ్,డిపార్ట్మెంట్ అధికారులు డీఈవో. ప్రసాద్, బాలాజీ, ఆన్సర్, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొని, నూతన గృహాల నిర్మాణం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.